వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో నవ్వుల వర్షం కురిపించిన టిడిపి-బిజెపి నేతల సంవాదం:కెజిహెచ్ లో పడుకోవడంపై పరస్పరం సెటైర్లు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రస్తావించిన ఒక సెంటిమెంట్‌ సభలో నవ్వుల వర్షం కురిపించింది. ఈ సెంటిమెంట్ విషయమై బిజెపి ఎల్పీ విష్ణుకుమార్ రాజు, టిడిపి మంత్రి యనమల రామకృష్ణుడు పరస్పరం 'పంచ్' లు వేసుకున్నారు.

చంద్రబాబు,టిడిపి ప్రభుత్వంపై మళ్లీ ఫైర్ అయిన జివిఎల్:బిజెపి నేతలు డబ్బులు తేవడంలో ఫెయిల్ చంద్రబాబుచంద్రబాబు,టిడిపి ప్రభుత్వంపై మళ్లీ ఫైర్ అయిన జివిఎల్:బిజెపి నేతలు డబ్బులు తేవడంలో ఫెయిల్ చంద్రబాబు

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే ప్రారంభం కాగా ఉదయం ప్రశ్నోత్తరాలతో శాసన సభ ప్రారంభమైంది. దీంతో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపి ఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు విశాఖపట్టణం కేజీహెచ్ లో ఉన్న పలు సమస్యల గురించి మాట్లాడుతూ అక్కడి సెంటిమెంట్ గురించి సభలో ప్రస్తావించారు. ఆ తరువాత ఇదే అంశం గురించి మంత్రి యనమల మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే ప్రస్తావించిన సెంటిమెంట్ గురించి సెటైర్ వేయగా దానిపై మళ్లీ విష్ణుకుమార్ రాజు స్పందించారు.

Raining laughs:satires war between BJP-TDP leaders in Assembly session

తొలుత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ...''అధ్యక్షా...ఇంతకు ముందు వైద్యశాఖను మా పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావుగారు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ శాఖను సీఎంగారే నిర్వహిస్తున్నారు...కెజిహెచ్ లో కనీసం ఇప్పుడైనా మార్పు రావాలి...ఇప్పుడున్న జనాభాకు వెయ్యి పడకలు సరిపోవడం లేదు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. నేను నాలుగేళ్ల నుంచీ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు"

"ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రిగారు తరచూ విశాఖపట్టణం వస్తున్నారు. అది మంచిదే. ఒకసారి ఆయన కేజీహెచ్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది వరకు మా మంత్రిగారైన కామినేని శ్రీనివాస్ గారు కేజీహెచ్‌లో ఒక రాత్రి బస చేశారు. నేను వద్దని చెప్పినా ఆయన వినలేదు. ఆ తర్వాత ఆయన పోస్టు పోయింది. అక్కడ ఏదో సెంటిమెంట్ ఉందట. అందుకే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పడుకోవద్దులే కాని...ఒక్కసారి విజిట్ చేస్తే చాలు"...అని నవ్వుతూ సెటైర్ వేశారు. "ఆయన కనుక విజిట్ చేస్తే కేజీహెచ్ రూపురేఖలు మారిపోతాయనే నమ్మకం ఉంది. తప్పకుండా కేజీహెచ్ బాగుపడుతుంది"..అని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

అనంతరం ఈ విషయమై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ...''బిజెపి నేత విష్ణుకుమార్ రాజు గారు అన్నీ చాలా వివరంగా చెప్పారు...వాళ్ల మంత్రిగారు వెళ్లి అక్కడ పడుకుంటే ఆయన ఉద్యోగం పోయిందట...ఆయనతో పాటు ఈయన కూడా పడుకుని ఉండాల్సింది'' అని వ్యంగాస్త్రం సంధించారు.
యనమల వేసిన ఈ సెటైర్‌కు సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

అయితే యనమల సెటైర్ పై వెంటనే ప్రతిస్పందించిన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు " అయితే నాకు మంత్రి పదవి ఇవ్వండి...పడుకుంటా" అనడంతో సభలో మరోసారి నవ్వులు విరిశాయి. అనంతరం యనమల తన ప్రసంగం కొనసాగిస్తూ కేజీహెచ్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని, ఖాళీగా ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు.

English summary
Amaravathi:In the Assembly session, BJP MLA Vishnu Kumar Raju has mentioned about a sentiment cause to smiles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X