అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆఫీస్‌లోకి నీరుపై ట్విస్ట్: కుట్ర కోణం.. పైప్ కట్ చేశారు, బాబు సీరియస్

నవ్యాంధ్ర అసెంబ్లీలోకి నీరు రావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌ను పిలిపించి వివరణ కోరారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర అసెంబ్లీలోకి నీరు రావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌ను పిలిపించి వివరణ కోరారు. కొత్త భవనంలోకి నీరు రావడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.

<strong>జగన్ కార్యాలయంలోకి నీరు.. వీడియో ఇలా లీకైంది</strong>జగన్ కార్యాలయంలోకి నీరు.. వీడియో ఇలా లీకైంది

జగన్ కార్యాలయంలోకి నీరు.. సరికొత్త కోణం

జగన్ కార్యాలయంలోకి నీరు.. సరికొత్త కోణం

జగన్ కార్యాలయంలోకి వర్షపు నీరు రావడంపై మరో కొత్త ట్విస్ట్. ఈ చాంబర్లోకి నీరు రావడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని సిఐడి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ చాంబర్‌కు సిఐడి అధికారులు బుధవారం వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ చాంబర్.. పైన ఉన్న రెయిన్ వాటర్ పైప్ కట్ చేసి ఉన్నట్లు గుర్తించారు.

స్పీకర్ ఆరా

స్పీకర్ ఆరా

అసెంబ్లీలోకి నీరు రావడంపై సభాపతి కోడెల శివప్రసాద రావు కూడా ఆరా తీశారు. నీరు ఎందుకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వివరణ ఇచ్చారు. జగన్ కార్యాలయంలో ఇటీవల కొన్ని రిపేర్లు జరిగాయని, అందుకే నీరు లోపలకు వచ్చిందని చెప్పారు.

విచారణలో అన్నీ తేలుతాయి

విచారణలో అన్నీ తేలుతాయి

ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదన్నారు. ఇక్కడే నీరు ఎందుకు వచ్చిందన్నారు. పైప్ ఎందుకు కట్టయిందో తెలియాలన్నారు. విచారణలో అన్నీ తేలుతాయన్నారు. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా పైప్ కట్ చేసినట్లుగా ఉందని తెలిపారు.

కేవలం జగన్ చాంబర్లోకే నీళ్లు

కేవలం జగన్ చాంబర్లోకే నీళ్లు

అసెంబ్లీలో ఎక్కడా నీటి ధార కురవలేదని చెబుతున్నారు. కేవలం జగన్ కార్యాలయంలోకే ఎందుకు వచ్చాయని అంటున్నారు. కాబట్టే కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

ఇలా లోపలకు వచ్చాయని భావిస్తున్నారు..

ఇలా లోపలకు వచ్చాయని భావిస్తున్నారు..

జగన్ చాంబర్ కార్యాలయంలో పైన రెయిన్ వాటర్ పైప్ లైన్ కట్ చేశారు. ఆ తర్వాత ఏసీ పైప్ లైన్ లోపలకు ఉంది. ఇది కూడా కట్ చేసి ఉంది. అంటే ఏసీ పైప్ లైన్ ద్వారా నేరుగా జగన్ చాంబర్లోకి నీళ్లు వెళ్లేలా కుట్ర చేశారని అంటున్నారు.

సీఐడీ విచారణకు ఆదేశం

సీఐడీ విచారణకు ఆదేశం

జగన్ కార్యాలయంలోకి నీళ్లు వెళ్లడంపై పూర్తిస్థాయి దర్యాఫ్తు జరుపుతామని అధికార వర్గాలు చెబుతున్నాయి. సిఐడి విచారణతో అన్ని విషయాలు తేలుతాయని చెబుతున్నారు. జగన్ చాంబర్లోకి నీరు వచ్చిందని తెలిసినప్పటి నుంచి అసలు లోపం ఎక్కడ అని తనిఖీలు చేస్తూ వచ్చారు. చివరకు ఈ రోజు కుట్ర కోణం తెలిసిందని అంటున్నారు.

పైప్ లైన్ ఎలా కట్ అయింది

పైప్ లైన్ ఎలా కట్ అయింది

అసలు పైప్ లైన్ ఎలా కట్టయిందో తేలాలి అని అంటున్నారు. అక్కడ కొన్ని రిపేర్లు జరిగాయి. కాబట్టి దాని వల్ల జరిగాయా లేక ఉధ్దేశ్య పూర్వకంగా ఎవరైనా కుట్ర పూరితంగా కట్ చేశారా అనే విషయం తేలాలి అని అంటున్నారు.

English summary
Water allegedly entered Leader of Opposition YS Jagan Mohan Reddy’s chamber in the Assembly building from the roof following heavy rain that lashed Guntur district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X