వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు ఫ్యాన్‌నే: పవన్‌పై రాజా ఫైర్, టిడిపిలో ప్రిన్స్ హ్యాపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధైర్యం ఉంటే సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలను నిలదీయాలని నటుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రాజా శనివారం అన్నరాు. తూర్పుగోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. పవన్‌కు సత్తా ఉంటే జగన్‌పై నిలబడి గెలవాలని సవాల్ చేశారు. తన సినిమాకు థియేటర్లు దొరకనప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా తాను చిరంజీవి అభిమానినని, తనకు ఎవ్వరూ గాడ్‌ఫాదర్‌లు లేరన్నారు.

Raja questions Pawan Kalyan

జయదేవ్‌పై మహేష్ బాబు

గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో తన బావ గల్లా జయదేవ్‌దే విజయమని ప్రముఖ సినీ నటుడు మహేశ్‌బాబు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుంటూరులోని తన ఫ్యాన్స్‌తో పాటు అక్కడి ప్రజలంతా జయదేవ్‌కు నీరాజనాలు పడుతున్నారని, ఆయనను తమ సొంత మనిషిలా చూసుకుంటున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>I'm really happy that all my fans n people of guntur have welcomed and embraced <a href="https://twitter.com/jaygalla">@jaygalla</a> as their own..</p>— Mahesh Babu (@urstrulyMahesh) <a href="https://twitter.com/urstrulyMahesh/statuses/462449079096598528">May 3, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

శనివారం మహేష్ ట్విటర్లో ట్వీట్ చేశారు. తన బావ జయదేవ్‌కు అనుకూలంగా గతంలో కూడా ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచీ తనకు తన బావే స్ఫూర్తి అని, ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష ఆయనకు బలంగా ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని చెప్పినప్పుడు.. ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు తీసుకు రావడానికి రాజకీయాలే మార్గమని, రాజకీయాల ద్వారా ఎక్కువమందికి సేవ చేయవచ్చని ఆయన చెప్పేవారని వివరించారు.

ప్రజా జీవితంలో ఆయన మార్పు తీసుకొస్తారని తనకు విశ్వాసం ఉందని, తన ఓటు ఆయనకేనని కూడా అప్పట్లో ట్వీట్ చేశారు. తాజాగా శనివారం దానికి కొనసాగింపుగా మరోసారి ఆయన ట్విటర్లో తన అభిప్రాయాన్ని ఉంచారు. జయదేవ్ ఎన్నికల ప్రచారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నానని, ఆయన ఘన విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. మహేష్ మరోసారి ట్వీట్ చేయడంపై టిడిపి వర్గాలు ఆనందంగా ఉన్నాయి.

English summary
With elections in Seemandhra just around the corner, Mahesh posted on Twitter saying, “I’m really happy that all my fans n people of guntur have welcomed and embraced jaygalla as their own..Have been following his campaign closely n I’m sure he will win with a thumping majority.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X