• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొండి వద్దు: రాజయ్య హెచ్చరిక, వారు సై.. (పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: జూనియర్ డాక్టర్లకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి రాజయ్య మంగళవారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. జూనియర్‌ డాక్టర్లు తమ మొండి వైఖరి విడనాడి విధుల్లోకి చేరాలని సూచించారు. జూడాల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామన్నారు.

జూనియర్‌ డాక్టర్లు కోరుకున్న దానికంటే అధికంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల విభజన అనంతరం తెలంగాణలో ఖాళీలు వస్తే జూడాలు కోరుకున్నట్లే సర్దుబాబు చేస్తామని తెలిపారు. జూడాల వెనుక ఏవో శక్తులు ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

డెంగ్యూ మరణాల పైన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని రాజయ్య వెల్లడించారు. డెంగ్యూ జ్వరాల పైన ఆయన వరంగల్ జిల్లాలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఐదు జిల్లాల్లో 53 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.

ప్రజలను ప్రయివేటు ఆసుపత్రులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు వరుసగా డెంగ్యూ భారిన పడుతున్నాయన్నారు. రేపు అక్కడ పర్యటిస్తానని చెప్పారు.

జుడాలపై కర్నె ప్రభాకర్ ఆగ్రహం

28 రోజులుగా జూడాలు సమ్మె చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. జూడాల చర్యలు బాధాకరమన్నారు. గ్రామీణ ప్రజానీకం అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి సేవలందించడం జూడాల బాధ్యత అన్నారు. బోధనాసుపత్రుల్లో సమ్మెలు చేయడాన్ని నిషేధిస్తూ 2013లోనే జీవో వచ్చిందని చెప్పారు.

 జుడాలు

జుడాలు

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు. నోటికి వారు నల్లటి గుడ్డ కట్టుకొని ధర్నా చేశారు.

జుడాలు

జుడాలు

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు. గ్రామీణ సర్వీసుకు తాము సిద్ధమని, సంవత్సరం కాదు, జీవితాంతమని వారు ప్లకార్డులు పట్టుకున్నారు.

 జుడాలు

జుడాలు

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు.

 జుడాలు

జుడాలు

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు. జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది 12వ రోజుకు చేరుకుంది.

 జుడాలు

జుడాలు

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు. ఆందోళనలో పాల్గొన్న జూనియర్ డాక్టర్ల దృశ్యం.

సామాజిక బాధ్యతతో జూడాలు మెలగాలన్నారు. జుడాల డిమాండ్ల పైన ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. చర్చల్లో నాలుగు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. జుడాలు మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు పని చేయమని చెప్పడం సరికాదన్నారు.

తుపాను వల్ల వైద్యఆరోగ్య శాఖకు వందకోట్ల నష్టం: కామినేని

హుధుద్ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు వంద కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ సచివాలయంలో తెలిపారు. డిసెంబరు నుంచి ప్రభుత్వాసుపత్రులలో పీపీపీ విధానాన్ని అమలుచేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియోథెరపిక్ విభాగాన్ని అదే పద్ధతిలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

త్వరలో అన్ని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తామన్నారు. ఇకపై ఉద్యోగులందరూ సమయానికి రావాలన్నారు. రాష్ట్రం అంతటా త్వరలో వెయ్యి జెనరిక్ ఔషధ దుకాణాలు ప్రారంభిస్తామని, వాటి ద్వారా పేదలకు అతి తక్కువ ధరలకే మందులు అందిస్తామన్నారు. అటు డిసెంబర్ 1 నుంచి జర్నలిస్టులకు ఆరోగ్య కార్డుల జారీ చేస్తామని, ఈ నెల 30న ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

English summary
Telangana state Deputy CM Rajaiah furious on JUDA's dharna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X