వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్స్‌లో రాజయ్య తనిఖీలు, సమస్యల పుట్ట (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజామ్ వైద్య విజ్జాన సంస్థ (నిమ్స్)లో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య తనిఖీలు నిర్వహించారు. ఆయనకు సమస్యల పుట్టగా అది కనిపించినట్లుంది. నిమ్స్‌లో అవినీతి, అక్రమాలు, అవకతకలు, కాంట్రాక్టు పనుల ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిస్తామని మంత్రి చెప్పారు. గురువారం ఉదయం రెండు గంటలపా టు ఆయన నిమ్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నిమ్స్‌కు రూ. 134 కోట్ల ఆదాయం వస్తుందని, అయినప్పటికీ రూ.10 నుంచి 20 కోట్ల లోటు కనిపిస్తుందన్నారు. ఈ లోటు పూరించడానికి ఆదాయ మార్గాలను ఆన్వేషించాల్సిన అవసరముందన్నారు. నిమ్స్‌లో కొంతకాలంగా ఉద్యోగుల విషయంలో వివక్ష చాలా ఉందని, ఇది క్షమించరానిదని, వివక్ష చూపే అధికారులపై కఠిన చర్య లు తప్పవని ఆయన చెప్పారు.

నిమ్స్‌లో ట్రామా, సూపర్‌స్పెషాలిటీ విభాగాలు సిక్క్ యూనిట్లుగా మారిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ అవసరమైన పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేసి రోగులకు ఆ విభాగాల వైద్యసేవలందిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిమ్స్‌ను ఎయిమ్స్‌గా అభివృద్ధి చేసే యోచన ఉందన్నారు.

న్యాయం కావాలి

న్యాయం కావాలి

నిమ్స్‌ను తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి రాజయ్య తనిఖీ చేస్తున్న సమయంలో కొంతమంది ఉద్యోగులు, నర్సులు ఆందోళన చేశారు. తనిఖీ ముగించుకుని డైరెక్టర్ ఛాంబర్ వద్దకు వచ్చిన మంత్రి ఎదుట ఉద్యోగులు ఆందోళన చేశారు.

సాకులు చూపుతున్నారు..

సాకులు చూపుతున్నారు..

ఒప్పంద పద్ధతిలో తమను విధుల్లోకి తీసుకున్నారని, ఇప్పుడు గడువు తీరిందనే సాకుతో తొలగించడం అన్యాయమని ఆందోళనకు దిగిన ఉద్యోగులు, నర్సులు మంత్రి రాజయ్య దృష్టికి తేచ్చారు. ఈ విషయాన్ని పరిశీలించి న్యా యం చేస్తామనని ఆయన హామీ ఇచ్చారు. నిమ్స్ ఓపీ బ్లాక్ ఎదుట కూడా నర్సులు ధర్నా చేశారు.

వైద్య సేవలపై ఆరా..

వైద్య సేవలపై ఆరా..

నిమ్స్‌లోని అన్ని విభాగాలు, వార్డులను వైద్యఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య తనిఖీ చేశారు. మొదట ఆయన ట్రామాకేర్ విభాగంలో అన్ని వార్డులను పరిశీలించారు.

రోగుల వద్దకు వెళ్లి...

రోగుల వద్దకు వెళ్లి...

రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఇతర వార్డులు, ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు.

మంత్రి అసంతృప్తి

మంత్రి అసంతృప్తి

నిమ్స్ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ చాలా అధ్వాన్నంగా ఉందని రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తించే విధానాలు ఇక్కడి కాంట్రాక్ట్ సిబ్బందికి అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

ప్రత్యేకంగా సమావేశం

ప్రత్యేకంగా సమావేశం

నిమ్స్‌ను తనిఖీ చేసిన సమయంలో రాజయ్య దృష్టికి ఉద్యోగులు, నర్సులు తమ సమస్యలను తీసుకొచ్చారు. ఉద్యోగులు, నర్సులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జీవన్ దాన్ ఆఫీసులో..

జీవన్ దాన్ ఆఫీసులో..

జీవన్‌దాన్ ఆఫీసులో పరిస్థితులను మంత్రి రాజయ్య పరిశీలించారు. అక్కడ పారిశుధ్యం తీరుపై ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. వాష్ రూంలు అధ్వాన్నంగా ఉంటే ఎలా అని ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. తరువాత మిలీనియం బ్లాక్, ఫిజియోతెరిఫీ విభాగాలు, ఓల్డ్ భవనంలో తనిఖీలు చేశారు.

మంత్రి మండిపాటు

మంత్రి మండిపాటు

కుల, ప్రాంతీయ వివక్ష చూపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, నర్సుల విషయంలో ఇది ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులున్నాయని మంత్రి మీడియా సమావేశంలో అన్నారు. విభాగం అధిపతులు వివక్ష చూపితే చర్యలు తప్పవన్నారు.

నిమ్స్‌లో పూర్తి కంప్యూటరైజేషన్ కోసం సీ.డాక్ సంస్థతో పాలకవర్గం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు డిప్యూటీ సీఎం రాజయ్య సమక్షంలో గురువారం ఆస్పత్రి ఆడిటోరియంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం నిమ్స్‌లో అన్ని వ్యవహారాలను కంప్యూటరీకరిస్తారు.

దక్షిణ భారతదేశంలో ప్రభుత్వం ఆధీనంలోని ఆస్పత్రుల్లో కంప్యూటరైజేషన్ చేసుకుంటున్న మొదటి ఆస్పత్రిగా నిమ్స్ నిలుస్తుంది. రూ.18.3 కోట్లతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ వివరించారు. అన్ని వార్డులు, విభాగాల మధ్య కంప్యూటర్లను అనుసంధానం చేస్తామన్నారు. నిమ్స్‌లో జరిగే ప్రతి వ్యవహారం ఇక ఆన్‌లైన్ పద్ధతిలోనే జరుగుతుందన్నారు.

English summary

 Telangana deputy CM and health minister Rajaiah visited NIMS in Hyderabad on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X