అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే బాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేదు: రాజమౌళి, డిజైన్లపై మళ్లీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. అయితే రాజధాని అమరావతి డిజైన్లపై వారి మధ్య చర్చ జరిగింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. అయితే రాజధాని అమరావతి డిజైన్లపై వారి మధ్య చర్చ జరిగింది.

అదొక్కటే కాదు, మరో కోణం: పవన్ కళ్యాణ్‌పై మోడీ ఆగ్రహం వెనుక, అవసరమే కానీఅదొక్కటే కాదు, మరో కోణం: పవన్ కళ్యాణ్‌పై మోడీ ఆగ్రహం వెనుక, అవసరమే కానీ

పూర్తిస్థాయిలో చర్చించలేదు

పూర్తిస్థాయిలో చర్చించలేదు

కానీ పూర్తిస్థాయిలో చర్చ జరగలేదు. ఇందుకోసం ఈరోజు మరోసారి భేటీ కానున్నారు. అయితే, అవసరమైతే డిజైన్ల కోసం రాజమౌళిని లండన్ పంపించనున్నారని కూడా తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం రాజమౌళి మాట్లాడారు.

నేను ఆలస్యంగా వచ్చా అందుకే: రాజమౌళి

నేను ఆలస్యంగా వచ్చా అందుకే: రాజమౌళి

తాను సీఎం చంద్రబాబును కలిశానని రాజమౌళి చెప్పారు. అయితే డిజైన్ల పైన ఎక్కువసేపు చర్చించలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగలేదన్నారు. తాను ఆలస్యంగా రావడం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోయినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం మరోసారి భేటీ అవుతామని చెప్పారు.

ఇంతకుముందే డిజైన్ల అందజేత

ఇంతకుముందే డిజైన్ల అందజేత

బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో రాజమౌళి, చంద్రబాబు భేటీ అయ్యారు. ఇంతకుముందే, ఇందులో భాగంగా రెండు రోజుల కిందట మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌లు రాజమౌళితో భేటీ అయి డిజైన్ ప్రతులు అందించారు.

త్వరలో లండన్ వెళ్లే అవకాశం

త్వరలో లండన్ వెళ్లే అవకాశం

సీఎం చంద్రబాబు నాయుడు రాజమౌళి బాహుబలి సెట్టింగ్‌కు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అమరావతి డిజైన్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. అవసరమైతే రాజమౌళిని లండన్ పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

English summary
Tollywood director Rajamouli on Wednesday has met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu over Amaravati designs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X