వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిరెడ్డి..సుజనా క‌లిసి వ్యూహం : చ‌క్రం తిప్పుతున్న సీఎం ర‌మేష్: ఢిల్లీ కేంద్రంగా కొత్త స‌మీక‌ర‌ణాల

|
Google Oneindia TeluguNews

Recommended Video

బీజేపీ ముఖ్యుల మెప్పు కోసం పోటీ ప‌డుతున్న ఏపీ ఎంపీలు|| Rajayasabha Members From AP Taken Active Role

ఏపీ ఎంపీలు బీజేపీ ముఖ్యుల మెప్పు కోసం పోటీ ప‌డుతున్నారు. రాష్ట్రం కోసం ఏనాడు క‌లిసి క‌ట్టుగా న‌డ‌వ‌ని ఎంపీలు బీజేపీ ప్ర‌యోజ‌నాల కోసం మాత్రం పార్టీల‌కు అతీతంగా ఒక్క‌ట‌వుతున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ వీడి బీజేపీలోకి చేరిన ఎంపీలు ఇప్పుడు బీజేపీ నుండి గెలిచిన ఎంపీల కంటే ఎక్కువ‌గా ఆ పార్టీ కోసం తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ఇక‌, వైసీపీ చాలా కాలంగా బీజేపీతో స‌న్నిహితంగా ఉంటోంది. తాజాగా..రాజ్య‌స‌భ‌లో ఆర్టీఐ స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం పొంద‌ట టానికి ఏపీకి చెందిన టీడీపీ..వైసీపీ ఎంపీలే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అంతే కాదు టీఆర్‌య‌స్..టీడీపీ స‌భ్యులు ఆ బిల్లుకు మద్ద‌తు ఇచ్చేందుకు ఏకంగా స్పెష‌ల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ వ్య‌వ‌హారం మొత్తం లో సీఎం ర‌మేష్ కీల‌క పాత్ర పోషిస్తే..సుజ‌నా..విజ‌య సాయిరెడ్డి మంత్రాంగం న‌డిపారు.

అక్క‌డ వారంతా ఒక్క‌ట‌య్యారు...

అక్క‌డ వారంతా ఒక్క‌ట‌య్యారు...

నిన్న మొన్న‌టి దాకా వారు టీడీపీ ఎంపీలు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. ఏపీలో మాత్రం వారు వైసీపీకి రాజ‌కీ యంగా బ‌ద్ద వ్య‌తిరేకులు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలోనూ క‌లిసి పోరాడ‌టానికి ఇష్టప‌డ‌ని వారు. ఇక‌, ఇప్పుడు మాత్రం ప్ర‌ధాని మోదీ..బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా మెప్పు కోసం మాత్రం పోటీ ప‌డి ప‌ని చేస్తున్నారు. బీజేపీలో ఎప్ప‌టి నుండి ఉన్న వారి కంటే కొత్త‌గా టీడీపీ నుండి చేసిన సీఎం ర‌మేష్‌..సుజ‌నా చౌద‌రి కీల‌కంగా మారారు. తాజాగా ఆర్టీఐ బిల్లు స‌వ‌ర‌ణ కోసం రాజ్య‌స‌భ‌లో ఓటింగ్ జ‌రిగింది. దాని కోసం ఎన్డీఏకు కావాల్సిన పూర్తి మెజార్టీ లేదు. దీంతో.. సీఎం రమేష్‌..సుజ‌నా చౌద‌రి..విజ‌య సాయిరెడ్డి ఏ విధంగా అయినా బ‌ల్లు ఆమోదం పొందేలా వ్యూహాలు ర‌చించారు. సుజనా చౌద‌రి..విజ‌య సాయిరెడ్డి క‌లిసి ఓటింగ్ లెక్క‌ల‌ను మందుగా స‌మీక్షించుకుంటూ క‌నిపించారు. ఈ స‌మ‌న్వ యం కేవ‌లం బీజేపీ పెద్ద‌ల మెప్పు కోస‌మే..ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం మాత్రం కాదు.

స్పెష‌ల్ ప్లైట్‌లో ఎంపీలు..

స్పెష‌ల్ ప్లైట్‌లో ఎంపీలు..

ఇక‌...బీజేపీతో దూరం అని చెబుతున్న టీడీపీ..టీఆర్‌య‌స్ ఎంపీలు ప్ర‌త్యేక విమానంలో వెళ్లి మ‌రీ ఈ బిల్లుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. టీడీపీ వీడినా బీజేపీలో చేరినా..ఇంకా సుజనా..సీఎం ర‌మేష్ హ‌వా కొన‌సాగుతున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపి స్తోంది. రాజ్య‌స‌భ‌లో టీడీపీ స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ తొలుత ఈ బిల్లు స‌వ‌ర‌ణ‌కు త‌మ పార్టీ వ్య‌తిరేకం అని చెప్పారు. ఆ వెంట‌నే టీడీపీ మ‌రో స‌భ్యురాలు సీతామాల‌క్ష్మి ..టీఆర్ ఎస్ ఎంపీ సంతోష్‌తో క‌లిసి ప్ర‌త్యేక విమానం లో వ‌చ్చి మరీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన‌ట్లు స‌మాచారం. దీని ద్వారా ఆ ఇద్ద‌రూ ఎంపీలు సీఎం ర‌మేష్‌.. సుజ‌నా చౌద‌రి మాటే ఇంకా చెల్లుబాటు అవుతుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక‌, వైసీపీ ఏపీలో అధికారంలోకి వ‌చ్చినా.. కేంద్రంలో మాత్రం బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు బీజేపీకి మ‌ద్ద‌తుగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

చ‌క్రం తిప్పిన సీఎం ర‌మేష్..

చ‌క్రం తిప్పిన సీఎం ర‌మేష్..

కాంగ్రెస్‌ మినహా విపక్షాలను ఒప్పించడంలో ఇటీవల టీడీపీకి టాటా చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్న ఎంపీ సీఎం రమేష్‌ చక్రం తిప్పారు. కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాల్లోని అనేక పార్టీల‌ను ఒప్పించి ఎన్డీఏ ప్ర‌తిపాద‌న‌కు అనుకూలంగా ఓటు వేయించ‌టంలో స‌క్సెస్ అయ్యారు. రమేష్ చక్రం తిప్పడంతో బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించిందని.. ఆయన్ను కేంద్ర మంత్రులు అమిత్‌ షా, పీయూష్‌గోయల్‌‌తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు శభాష్ అంటూ అభినందించారు. కాగా గత కొన్ని రోజులుగా లోక్‌సభలో మాత్రమే బిల్లు పాస్ అవ్వగా.. రాజ్యసభ ఆమోదం లభించక పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ బిల్లు పాస్ అవ్వ‌టంలో సీఎం ర‌మేష్..సుజ‌నా చౌద‌రి..విజ‌య సాయిరెడ్డి కీల‌క భూమిక పోషించారు. ఇక‌, ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం రాజ‌కీంగా హాట్ టాపిక్‌గా మారింది.

English summary
Rajayasabha Members from AP taken active role in RTI amendment bill approved in upper house. CM Ramesh, Sujana Chowdary and Vijaya sai reddy taken initiate in this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X