వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి మోడీ ప్రభుత్వంలో లేదా: రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆందోళనలపై ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎపికి ప్రత్యేక హోదాపై ప్రభుత్వంలో భాగస్వాములైన టిడిపి పార్లమెంటు సభ్యులు సభలో గందర గోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.

సభ వాయిదా పడేలా చేస్తున్నారని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలేం జరుగుతోంది, టిడిపి మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందా లేదా అని అడిగారు.

Rajdeep Sardesai: Isn't TDP part of the Modi Govt?

లోకసభలో క్రేజీ సీన్స్ అంటూఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సభ వెలుపలా లోపలా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

దాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్‌దీప్ సర్దేశాయి ఆ వ్యాఖ్యలు చేశారు. బహుశా, ప్రభుత్వంలో కొనసాగుతూ ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పు పడుతూ ఉండవచ్చు.

English summary
Rajdeep Sardesai tweets - TDP MPs, part of ruling alliance, disrupt the house over AP special status. Force adjournment. Isn't TDP part of the Modi Govt? What the hell is going on here?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X