వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ ఎంట్రీ: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెలరేగిన ఊహాగానాలపై నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి.

తన రాజకీయ ఎంట్రీ ఊహాగానాలపై ఆయన తాజాగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సంస్త ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఆ కార్యక్రమంలో ఆయన తన పొలిటకల్ ఎంట్రీ పుకార్లపై మాట్లాడారు.

Rajendra Prasad clarifies on his political entry rumors

రాజకీయాలు తనకు పడవని, తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో అందరినీ ఆనందింజేయడమే ఇష్టమని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. టామీ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నందుకు ఆయనకు సత్కరించారు.

క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీల్లో ఉత్తమ లగు చిత్రంగా స్కెవ్యూ క్రియేషన్స్, శ్రీకాకుళం కథా రచయిత విజయ్ కుమార్ చిత్రీకరించిన క్రీమిలేయర్ ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ చిత్రంంగా మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య నిర్మించిన ఇండియా ఈజ్ డెడ్, తృతీయ ఉత్తమ చిత్రంగా గోదావరి టాకీస్ చిత్రం, రాజమండ్రి కథా రచయిత సి.. కల్యాణ్ రూపొందించిన బి ఆలర్ట్ ఎంపికయ్యాయి.

స్పెషల్ జ్యూరీ అవార్డులను ఇడియా ఈజ్ డెడ్‌లో ఇండియా పాత్రధారి చంద్రిక, పేరులో వికలాంగుడు పాత్ర ధరించిన సతష్ సుంకర దక్కించుకున్నారు.

English summary
Actor Rajendra Prasad has clarified on his political entry rumors in West Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X