తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ , చంద్రబాబు స్పందన ఇదే .. వ్యవసాయ చట్టాలపై కూడా పవన్ రెస్పాన్స్

|
Google Oneindia TeluguNews

2021 జనవరిలో రజినీకాంత్ తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గా గురువారం ట్వీట్ చెయ్యటం దేశ వ్యాప్త చర్చకు కారణం అయ్యింది. రాజకీయ పార్టీ పేరు విధివిధానాలపై డిసెంబర్ 31న క్లారిటీకి రానున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ తో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటున్న ట్లుగా తేలిపోయింది. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల కోసం పావులు కదుపుతుంటే, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా రాజకీయాల్లోకి రావడం ఆయన అభిమానుల్లో జోష్ నింపుతోంది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కూడా అభిమానుల బలంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఆయన రజనీ ఎంట్రీని స్వాగతించారు.

ఇదే సమయంలో చంద్రబాబు కూడా రజనీ మంచి ఫ్రెండ్ అన్నారు . రాజకీయాల్లో రాణించాలని కోరారు.

ఇదే సమయంలో చంద్రబాబు కూడా రజనీ మంచి ఫ్రెండ్ అన్నారు . రాజకీయాల్లో రాణించాలని కోరారు.

పరోక్షంగా ఎప్పటినుంచో రజనీ రాజకీయాల్లోనే వున్నారన్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో రైతుల ఆందోళన పైనా, అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో ఉందని, పరోక్షంగా ఎప్పటినుంచో రజనీ రాజకీయాల్లోనే వున్నారు అంటూ పేర్కొన్నారు. రజనీకాంత్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారని ఆ అభిమానం ఆయనను ముందుకు నడిపిస్తుందని, రాజకీయాల్లో రజినీకాంత్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్టు గా పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

రజనీకాంత్ తనకు మంచి ఫ్రెండ్ అన్న చంద్రబాబు

రజనీకాంత్ తనకు మంచి ఫ్రెండ్ అన్న చంద్రబాబు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు మంచి మిత్రుడని చెప్పిన చంద్రబాబు, ఆయన రాజకీయాల్లోకి రావడానికి స్వాగతిస్తున్నట్లు గా పేర్కొన్నారు. తమిళనాట రాజకీయాల్లో రజినీకాంత్ రాణించాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం లో కొత్త పార్టీలు రావడం సహజం అని పేర్కొన్న చంద్రబాబు రజనీకాంత్ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతుల మేలు కోసమే అన్న పవన్ కళ్యాణ్

కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతుల మేలు కోసమే అన్న పవన్ కళ్యాణ్

తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఒక పక్కన ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నా, రైతుల మేలు కోసమే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. లోటుపాట్లు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు జనసేనాని, ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర రైతులతో చర్చలు జరుపుతోంది అంటూ పేర్కొన్నారు.
పేరుతో రైతుల కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, రైతులకు అండగా ఉండేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

రైతుల కోసం గిట్టుబాటు ధర వచ్చేలా పోరాటం చేస్తాం

రైతుల కోసం గిట్టుబాటు ధర వచ్చేలా పోరాటం చేస్తాం

రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసేలా గిట్టుబాటు ధర వచ్చేలా, దళారీ వ్యవస్థను నిర్మూలించి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. తుపాను నష్టపరిహారం రైతులకు 35 వేల రూపాయలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇక నిన్న తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రైతులను పంట నష్టం గురించి , ప్రభుత్వం నుండి సాయం అందిందా లేదా అన్న విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు . రైతుల కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళతామన్నారు.

English summary
Janasena chief Pawan Kalyan made interesting remarks on the farmers agitation in Delhi, as well as the political entry of Tamil superstar Rajinikanth. Speaking on the political entry of Tamil superstar Rajinikanth, Pawan Kalyan said that Rajinikanth has always wanted to enter politics and indirectly Rajini has always been in politics. Chandrababu said Rajinikanth was a good friend of him and welcomed him into politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X