వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక నాశనమే: పవన్ కళ్యాణ్‌పై మాజీ నేత రాజు రవితేజ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడైన రాజు రవితేజ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ఆలోచనలకు విరుద్ధంగా..

ఆలోచనలకు విరుద్ధంగా..

పవన్ కళ్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారని రాజు రవితేజ విమర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో చేశానని, మరెంతో చేద్దామనుకున్నానని ఆయన తెలిపారు. కానీ, తన ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని అన్నారు.

పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు..

పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు..


పార్టీ బాగు కోసం చేసిన ఆలోచనల్ని పవన్ ఒక్కసారి కూడా అమలు చేయలేదని రాజు రవితేజ అన్నారు. పవన్ కళ్యాణ్ వైఖరి మునుపటిలా లేదని, అందుకే పార్టీని వీడినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం కూడా ఆయన పవన్ కళ్యాణ్ పై ఓ ప్రకటన ద్వారా విమర్శలు గుప్పించారు.

ఇక నాశనమే మిగిలింది..

ఇక నాశనమే మిగిలింది..


పవన్ కళ్యాణ్‌లో వివేకం చచ్చిపోయిందని, మనిషి నాశనం వివేకం నశించడంతోనే మొదలవుతుందని అన్నారు. ఒకప్పుడు పవన్ జీవితంలో జ్ఞానం, పాండిత్యం, హృదయంలో మంచితనం, దయ, కరుణ ఉండేవన్నారు. ఇప్పుడు అవి కాకుండా కుట్ర, మోసం, అబద్ధాలు, ద్వేషం నిండాయని విమర్శించారు.

విషపూరితంగా పవన్ రాజకీయాలు..

‘ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజా జీవితంలోకి ప్రవేశించామో మీరే ఆ వ్యాధిగా మారారు. నాకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా.. పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా ఉండమని మీరు కోరారు. దాదాపు 12ఏళ్లు మీ వెన్నంటే నడిచాను. పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను మీతో చర్చించాను. కానీ, మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి' అని రాజు రవితేజ విమర్శించారు. కులాలు, మతాల ప్రస్తావన తీసుకొచ్చి, అబద్ధాలు, అసభ్యకర బాషతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

కుట్రపూరిత మనిషిగా..

మీరెప్పుడూ ధర్మవంతమైన మనిషిగా కాలేరు. ఒక మంచి మనిషి నుంచి నిజాయితీలేని కుట్రపూరిత మనిషిగా మారారంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి రాజు రవితేజ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదని ధ్వజమెత్తారు. అర్హత లేకుండా పొందినది, అనుమతి లేకుండా వెళ్లిపోతుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను జనసేన పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.

English summary
Former leader of Janasena Raju Raviteja hits out at Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X