వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యకు ప్రధాని ప్రత్యేక గుర్తింపు - నేడే వీడ్కోలు : ఉపరాష్ట్రపతిగా అరుదైన రికార్డు..!!

|
Google Oneindia TeluguNews

వెంకయ్య నాయుడు ఈ నెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ రోజు వెంకయ్యకు రాజ్యసభ వీడ్కోలు పలకనుంది. ఈ నెల 11న నూతన ఉప రాష్ట్రపతిగా ధన్ ఖడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపుగా అయిదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు..గత అయిదేళ్ల కాలంలో ఉప రాష్ట్రపతిగా మరో రికార్డు సాధించారు. బీజేపీలో అనేక హోదాల్లో పని చేసిన వెంకయ్య పార్టీ అధికారంలో ఉన్న..లేకున్నా..పార్టీ వ్యవహారాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటనలు చేసేవారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీలో కొత్త అడ్రస్ కు వెంకయ్య మారనున్నారు.

వెంకయ్య కొత్త రికార్డు

వెంకయ్య కొత్త రికార్డు

అయితే, ఉప రాష్ట్రపతిగా అయిన తరువాత అయిదేళ్ల కాలంలో దేశంలోని ప్రతీ రాష్ట్రాన్ని సందర్శించి అరుదైన రికార్డు సృష్టించారు. దేశంలోని ప్రతీ రాష్ట్రాన్ని.. ప్రతీ కేంద్ర పాలిత ప్రాంతాన్ని పర్యటించిన ఏకైక ఉప రాష్ట్రపతిగా నిలిచారు. తన బాష..ప్రాస.. పంచ్ లు..వ్యంగోక్తులతో తన ప్రసంగాలను కొనసాగించే వెంకయ్య..ఉప రాష్ట్రపతి అయిన తరువాత కేవలం పెద్దిరకంగా సూచనలు - సలహాలకు మాత్రమే పరిమితమయ్యారు. ప్రధానంగా సేవా సంస్థలు.. విద్యాలయాలు..పరిశోథన సంస్థలను ఎక్కువగా వెంకయ్య సందర్శించారు. ప్రభుత్వ - ప్రయివేటు రంగాలను ఎక్కవగా ప్రారంభించారు. వెంకయ్య హయాంలో ఉపరాష్ట్రపతి నివాస భవన్ లో ప్రత్యేకంగా ఒక సమావేశం మందిరాన్ని నిర్మించారు.

ప్రధానితో సహా సభ్యులంతా

ప్రధానితో సహా సభ్యులంతా

ఉపరాష్ట్రపతిగా తన పని తీరును ప్రజల ముందు ఉంచేందుకు మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ పేరుతో ఏటా కాఫీ టేబుల్ బుక్ ను తీసుకొచ్చారు. ఇక, ఈ రోజు రాజ్యసభలో వెంకయ్యకు వీడ్కోలు పలకనున్నారు. అయిదేళ్ల పాటు ఛైర్మన్ హోదాలో వెంకయ్య భూమిక పైన ప్రధాని మోదీతో పాటుగా అన్ని పార్టీల నేతలు ఆయన అందించిన సేవలు.. సభలో సభ్యుడిగా మొదలైన ప్రస్థానం..చివరి అయిదేళ్లు సభను నిర్వహించే అధ్యక్ష స్థానంలో ఈయన వ్యవహరించిన తీరు పైన ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈ రోజు సాయంత్రం పార్లమెంట్ ఆవరణలోనే మరో కార్యక్రమం జరగనుంది. అందులో ప్రధాని మోదీ పాల్గొంటారు. వెంకయ్యకు ప్రత్యేక గుర్తింపుగా ఒక జ్ఞాపిక అందించనున్నారు. వెంకయ్య హయాంలో నిర్వహించిన కార్యక్రమాలతో రూపకల్పన చేసిన పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.

10వ తేదీ నుంచి కొత్త చిరునామాలో

10వ తేదీ నుంచి కొత్త చిరునామాలో

మంగళవార మొహరం.. గురువారం రాఖీ పండుగ కావటంతో ఈ రోజునే రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసారు. 10వ తేదీతో వెంకయ్య పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే వెంకయ్య కోసం ఢిల్లీలోనే ప్రత్యేకంగా మాజీ ఉప రాష్ట్రపతి హోదాలో కొత్త భవనం కేటాయించారు. అయితే, రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగు పెట్టి.. పెద్దల సభలో సభ్యుడిగానే కేంద్ర మంత్రి పదవులు నిర్వహించిన..వెంకయ్య అదే సభలో విపక్ష నేతగానూ వ్యవహరించారు. ఆ తరువాత ఉపరాష్ట్రపతి హోదాలో ఛైర్మన్ గా వ్యవహరించిన వెంకయ్య పదవీ విరమణ చేయబోతున్నారు. బీజేపీలోనే కాకుండా విపక్షాలు సైతం వెంకయ్య వ్యవహార శైలి.. సభలో ఆయన ప్రసంగాలను ఇష్టపడతారు. ఈ నెల 10న ఢిల్లీలోకి కొత్త చిరునామాకు మారనున్న వెంకయ్య..తనకు ఇష్టమైన ప్రజలతో ముఖాముఖి మాత్రం కొనసాగించనున్నారు.

English summary
Rajya Sabha Chairman M Venkaiah Naidu will be accorded a farewell in the House on Monday with Prime Minister Narendra Modi and other top leaders in attendance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X