• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీలో ఆ నలుగురు ఖరారు: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల: బీజేపీకి ఛాన్స్ ఇస్తారా..!

|

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏపీ అధికార పార్టీ వైసీపీలో రాజ్యసభ ఆశావాహుల సందడి మొదలైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు శాసన మండలి సైతం రద్దు కావటంతో..రాజ్యసభ కు ఒత్తిడి పెరిగింది. ఏపీ నుండి ఈ ఏప్రిల్ లో మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి.

Rajya Sabha ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్..!

 ఒక సీటు బీజేపీకి కేటాయిస్తారా..?

ఒక సీటు బీజేపీకి కేటాయిస్తారా..?

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 11..తెలంగాణకు ఏడు రాజ్యసభ సీట్లు కేటాయించారు. అందులో ప్రస్తుతం ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ నేత కే కేశవరావు, కాంగ్రెస్ సభ్యుడు ఎంఏ ఖాన్ ఏప్రిల్ 9వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అదే విధంగా కాంగ్రెస్ నుండి సభ్యుడైన టీ సుబ్బిరామరెడ్డి..టీడీపీ సభ్యురాలు తోట సీతారామాలక్ష్మి ఏప్రిల్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగా ఈ నాలుగు స్థానాలు మొత్తంగా వైసీపీకే దక్కనున్నాయి. దీంతో..ఇప్పటికే జగన్ ఈ స్థానాలు ఎవరికి కేటాయించాలనే దాని పైన ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్రంతో సన్నిహిత సంబంధాల్లో భాగంగా..ఈ నాలుగు స్థానాల్లో ఒకటి బీజేపీకీ కేటాయిస్తారనే ప్రచారామూ సాగుతోంది. దీంతో..చివరకు ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ వైసీపీలో మొదలైంది.

  Rajya Sabha Election Schedule Released,Political Heat Starts In Telugu States! | Oneindia Telugu
   నాలుగు సీట్లు వైసీపీకే..

  నాలుగు సీట్లు వైసీపీకే..

  ఇప్పటికే రాజ్యసభలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. విజయ సాయిరెడ్డితో పాటుగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీ నుండి సభ్యులుగా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో సామాజిక..ప్రాంతీయ సమ తుల్యత పాటిస్తూ జగన్ తమ సభ్యులను ఎంపిక చేయనున్నారు. అందులో ప్రముఖంగా జగన్ నలుగురి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తొలి నుండి వైయస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న ఆళ్ల కుటుంబానికి చెందిన అయోధ్య రామిరెడ్డికి జగన్ రాజ్యసభ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అదే విధంగా బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుదీర్ఘ కాలం టీడీపీ లో ఉండి..తాజాగా వైసీపీలో చేరిన బీదా మస్తాన్ రావుకు సైతం అవకాశం దక్కుతుందని ప్రచారం సాగుతోంది. ఇక, ఎస్సీ కోటాలో 2014లో టీడీపీ నుండి అమలాపురం ఎంపీగా గెలిచి..2019 ఎన్నికల ముందు వైసీపీ లో చేరిన పండుల రవీంద్రబాబు పేరు సైతం రేసులో ఉంది. ఇక, తాజాగా ఒక ప్రముఖ పేరు ప్రచారంలోకి వచ్చింది.

   న్యాయ వ్యవస్థలో కీలక స్థానంలో పనిచేసిన వ్యక్తికి ఛాన్స్..?

  న్యాయ వ్యవస్థలో కీలక స్థానంలో పనిచేసిన వ్యక్తికి ఛాన్స్..?

  న్యాయ వ్యవస్థలో కీలక స్థానంలో పని చేసిన ఒక ప్రముఖ వ్యక్తికి తమ పార్టీ నుండి రాజ్యసభకు పంపాలని పార్టీ భావిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఆ ప్రముఖుడు మాత్రం అందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పేరు సైతం వైసీపీ నుండి రాజ్యసభ రేసులో ఉంది. ఆయన కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.వైసీపీ నుండి చిరంజీవికి సైతం ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

  బీజేపీకి ఒక్క సీటు సాధ్యమేనా..

  బీజేపీకి ఒక్క సీటు సాధ్యమేనా..

  ఇక, వైసీపీ నుండి దక్కే నాలుగు సీట్లలో మూడు సీట్లు వైసీపీకి..ఒక సీటు బీజేపీకి ఇచ్చే అవకాశాలు లేక పోలేదనే వాదన సైతం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్డీఏలో వైసీపీ చేరుతుందనే ప్రచారాన్ని సీనియర్ మంత్రులు బొత్సా లాంటి వారు ఖండిస్తున్నారు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో ఏపీ కోటాలోనే సురేష్ ప్రభు రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అయితే, ఇప్పుడు ఎన్డీఏ లో చేరిక పైన వైసీపీ స్పష్టత ఇవ్వకపోయినా..బొత్సా లాంటి వారు మాత్రం తాము ఎక్కడా చేరిక విషయం చెప్పలేదని వాదిస్తున్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నిక సమయం నుండి పౌరసత్వ సవరణ బిల్లు వరకు కేంద్ర ప్రభుత్వ ప్రతీ నిర్ణయానికి పార్లమెంట్ లోని రెండు సభల్లోనూ వైసీపీ మద్దతిస్తూ వచ్చింది. దీంతో..వైసీపీ భవిష్యత్ లో సైతం ఇదే రకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని..దీంతో..బీజేపీకి ప్రత్యేకంగా సీటు కేటాయించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.

   పిల్లి సుభాష్, మోపిదేవిలకు ప్రాంతీయ మండళ్ల ఛైర్మెన్‌గా అవకాశం..?

  పిల్లి సుభాష్, మోపిదేవిలకు ప్రాంతీయ మండళ్ల ఛైర్మెన్‌గా అవకాశం..?

  ఈ నెలాఖరులో ఈ నాలుగు సీట్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నుండే నలుగురికి అవకాశం దక్కనుండటంతో..దీని పైన జగన్ తుది ప్రకటన చేయాల్సి ఉంది. ఇదే సమయంలో మండలి రద్దు కారణంగా మంత్రి పదవులు కోల్పోతున్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర బోస్..మోపిదేవి వెంకట రమణ కు సైతం ప్రాధాన్యత ఇస్తామని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. అయితే, వారికి రాజ్యసభ అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. వారిద్దరికీ ప్రాంతీయ మండళ్ల ఛైర్మన్లుగా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

  English summary
  Election Commission has released the schedule for the Rajyasabha elections. In this back drop 4 seats get vacated from AP. All the four seats will be filled by YCP candidates as the majority is more.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more