వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టులో సుజ‌నా స‌వాల్‌: సీబీఐ చ‌ర్య‌లు నిలిపివేయాలి: ఆ కంపెనీతో సంబంధం లేదు..!

|
Google Oneindia TeluguNews

సీబీఐ జారీ చేసిన నోటీసుల పైన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి హైకోర్టును ఆశ్ర‌యించారు. సీబీఐ నోటీసుల‌కు సంబంధించి త‌దుప‌రి చ‌ర్య‌ల‌న్నింటినీ నిలిపివేయాలంటూ పిటీష‌న్ దాఖ‌లు చేసారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి..సీబీఐల‌ను ప్ర‌తివాదులుగా చేర్చారు.

హైకోర్టుకు సుజ‌నా చౌద‌రి
బ్యాంకుకు రుణాలు చెల్లించ‌కుండా ఎగ‌వేసార‌నే అభియోగం పైన సీబీఐ కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల‌ను స‌వాల్ చేస్తూ సుజ‌నా చౌద‌రి హైకోర్టును ఆశ్ర‌యించారు. నోటీసుల‌ను సంబంధించి త‌దుప‌రి చ‌ర్య‌ల‌న్నింటినీ నిలిపివేయాల‌ని పిటీష‌న్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి..సీబీఐల‌ను ప్ర‌తివాదులుగా చేర్చారు.

చెన్నైకి చెందిన బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీ అధికారులతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ కంపెనీపై నమోదు చేసిన కేసులో తనను హాజరు కావాలని సీబీఐ ఎందుకు నోటీసులు జారీ చేసిందో అర్థం కావట్లేదన్నారు. నోటీసుల ద్వారానే తనకు బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌తోపాటు మరికొందరు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందని పేర్కొన్నారు.

Rajyasabha Member Sujana Chowdary filed petition against CBI in High court

ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీసే చ‌ర్య‌లు..
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తప్పుడు ఖాతాలతో తరలించారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసిందని సుజ‌నా చౌద‌రి పిటీష‌న్‌లో పేర్కొన్నారు. కేవలం ఖాతా పుస్తకాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు చూపి బ్యాంకులను రూ.72 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేసింది. బెంగుళూరులోని సీబీఐ కార్యాలయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయ‌టం కోసం హాజ‌రు కావాల‌ని నోటీసులో పేర్కొంది. అయితే, సుజ‌నా చౌద‌రి బెంగుళూరు వెళ్లినా..సీబీఐ ముందు హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది. దీంతో..సీబీఐ త‌దుప‌రొ చ‌ర్య‌ల‌కు దిగ‌కుండా ముందుగానే సుజ‌నా చౌద‌రి హైకోర్టును ఆశ్ర‌యించారు.

English summary
Rajyasabha MP and TDP senior leader Sujana Chowdary filed petition in Hi court against CBI. Lase week CBI issued notices to chowdary to attend before them. Chowdary appealed court order CBI to not proceed for further proceedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X