హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టాప్ హీరోయిన్ వ్యభిచారం కేసులో.. రాకేష్ మామూలోడుకాదు: మాయలో శిఖా, జయరాంను 'అమ్మాయి'తో కొట్టాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో అతడిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ప్రజాప్రతినిధి కుమారుడిగా చెప్పి ఆర్టిస్టులతో పరిచయాలు పెంచుకున్నాడు.

<strong>రెండో పెళ్లి, రాకేష్‌తో డేటింగ్, చెక్ పవర్: జయరాం మర్డర్ మిస్టరీపై శిఖాచౌదరి సంచలన విషయాలు!</strong>రెండో పెళ్లి, రాకేష్‌తో డేటింగ్, చెక్ పవర్: జయరాం మర్డర్ మిస్టరీపై శిఖాచౌదరి సంచలన విషయాలు!

ప్రముఖులతో సంబంధాలు లేకపోయినప్పటికీ వారి పేర్లు చెప్పి బెదిరింపులు, వసూళ్లకు దిగుతాడని గుర్తించినట్లుగా తెలుస్తోంది. మోసాలు, సెటిల్మెంట్లు అతని వృత్తి అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పలు కేసుల్లో అతను గతంలోను అరెస్ట్ అయ్యాడు.

టాప్ హీరోయిన్‌తో వ్యభిచారం కేసులో అరెస్ట్

టాప్ హీరోయిన్‌తో వ్యభిచారం కేసులో అరెస్ట్

గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో వ్యభిచారం చేయించిన కేసులో అతడు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. యువతులతో హైటెక్ వ్యభిచార ముఠా నడిపినట్లుగా అతడిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాయమాటలతో మోసం చేయడం అతని నైజం. జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇంట్లో అతను అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంట్లోనే జయరాంను నిర్బంధించినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. దర్యాఫ్తులో భాగంగా సోమవారం పోలీసులు రాకేష్ ఉంటున్న ఇంట్లో సోదాలు చేశారు.

<strong>మావయ్యతో నాకు శారీరక సంబంధం, నచ్చింది ఒప్పుకున్నా.. అది నా ఇష్టం: శిఖాచౌదరి</strong>మావయ్యతో నాకు శారీరక సంబంధం, నచ్చింది ఒప్పుకున్నా.. అది నా ఇష్టం: శిఖాచౌదరి

 ఎమ్మెల్యే పేరుతో దందా, ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని డబ్బు వసూలు

ఎమ్మెల్యే పేరుతో దందా, ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని డబ్బు వసూలు

రాకేష్ విలాసవంతమైన జీవితం చూసి శిఖాచౌదరి అతని మాయలో పడి ఉంటుందని భావిస్తున్నారు. జయరాంకు ఇచ్చిన రూ.4.5 కోట్లు అప్పుగా తెచ్చి ఇచ్చాడా లేక ఎలా ఇచ్చాడో తెలియాల్సి ఉంది. కాగా, కొద్దిరోజుల క్రితం కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరుతో ఓ వ్యక్తిని బెదిరించి, అతని నుంచి రూ.80 లక్షలు వసూలు చేసిన కేసులో రాకేష్ అరెస్టయినట్లుగా కూడా తెలుస్తోంది. ఓ రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉంటూ అతను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి కూడా డబ్బులు వసూలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

 అమ్మాయి పేరుతో... జయరాంను కూడా వీక్‌నెస్‌తో కొట్టాడు

అమ్మాయి పేరుతో... జయరాంను కూడా వీక్‌నెస్‌తో కొట్టాడు

తన నుంచి రూ.4.5 కోట్లు తీసుకున్న జయరాంను కూడా రాకేష్ వీక్‌నెస్‌తో కొట్టాడట. ఇందుకు రీనా అనే అమ్మాయి పేరుతో వల వేశాడు. డబ్బుల కోసం తాను ఫోన్ చేస్తే స్పందించడం లేదని, రీనా అనే అమ్మాయి పేరుతో వాట్సాప్ చాట్ చేశాడు. అందమైన అమ్మాయి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టాడు. హత్యకు ముందు జయరాంకు.. రీనా పేరుతో ఫోన్ చేశాడు.

ఎవరూ లేకుండా రావాలని షరతులు

ఎవరూ లేకుండా రావాలని షరతులు

తాను జూబ్లీహిల్స్‌లో ఉంటానని, ఖాళీగా ఉన్నానని, తన ఇంటికి రమ్మని రీనా అమ్మాయి పేరుతో రాకేష్.. జయరాంకు మెసేజ్ పెట్టాడు. దీంతో జయరాం ఆ ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో షరతు పెట్టాడు. కారు డ్రైవర్, గన్‌మెన్ లేకుండా రావాలని సందేశంలో ఉంది. దీంతో జయరాం తన కారు డ్రైవర్, గన్‌మెన్ లేకుండా వచ్చాడు. జయరాం రాగానే తన అనుచరులతో కలిసి రాకేష్ రెడ్డి అతనిని బలవంతంగా లోనికి తీసుకెళ్లాడు.

 డబ్బుల కోసం అనుచరుడిని పంపించాడు

డబ్బుల కోసం అనుచరుడిని పంపించాడు

అనంతరం 30వ తేదీ రాత్రంతా జయరాంను రాకేష్ రెడ్డి తన ఇంట్లోనే నిర్బంధించాడు. డబ్బులు ఇస్తే వదిలేస్తానని చెప్పాడు. దీంతో డబ్బుల కోసం కోస్టల్ బ్యాంకులో పని చేసే ఉమా అనే మహిళతో పాటు శిఖా చౌదరికి జయరాం ఫోన్ చేశారు. శిఖను రూ.10 లక్షలు అడిగితే తన వద్ద లేవని చెప్పింది. దీంతో తన బ్యాంకులో పని చేసిన ఈశ్వర ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేశాడు. రూ.6 లక్షలు ఇస్తానని చెప్పడంతో.. రాకేష్ తన అనుచరుడిని పంపించాడు. డబ్బు కోసం మరుసటి రోజ కూడా జయరాంను తన వద్దే ఉంచుకున్నాడు. ఆ తర్వాతే హత్ చేశాడని తెలుస్తోంది.

నందిగామ బార్ వద్ద సిసి కెమెరాల్లో రాకేష్ రెడ్డి

నందిగామ బార్ వద్ద సిసి కెమెరాల్లో రాకేష్ రెడ్డి

ఇదిలా ఉండగా, నందిగామ పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు. నందిగామలోని ఓ బార్ సీసీ కెమెరాల్లో రాకేష్ రెడ్డిని గుర్తించారు. జయరాం మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్పాట్‌కు తరలిస్తున్న సమయంలో విజయ బార్ వద్ద రెండు బీర్లు కొనుగోలు చేశాడు. అక్కడే మద్యం కొనుగోలు చేసి కొద్ది దూరం వెళ్లి తాగాడు. తర్వాత మృతదేహం ఉన్న కారును రోడ్డు పక్కన వదిలేసి వెళ్లాడు.

English summary
Rakesh Reddy is prime accused in NRI business men Jayaram's murder case. He have criminal background.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X