వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో భేటీలు: రామచరణ్ తేజ, శ్రీశైలంపై పండిట్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తేజ శుక్రవారం కలిశారు. ఆయన చంద్రబాబుకు 15 ల్కషల రూపాయల చెక్కును అందజేశారు. హుధుద్ తుఫాను సహాయక చర్యల కోసం ఆయన ఆ మొత్తాన్ని చంద్రబాబుకు అందించారు.

కాగా, చంద్రబాబును కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ పండిట్ కూడా కలిశారు. శ్రీశైలం ఎడగట్టు విద్యుత్తు కేంద్రంలో కరెంట్ ఉత్పత్తిపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ భేటీ జరింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని ఆపేసిందని పండిట్ చంద్రబాబుకు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని కొననసాగిస్తే రాయలసీమకు మంచినీటి ఎద్దడి ఏర్పడుతుందని చంద్రబాబు పండిట్‌కు తెలిపారు. త్వరలోనే ఈ సమస్యపై ఇరు రాష్ట్రాల ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని పండిట్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

Ram Charan Tej meets Chandrababu

బ్యాంకర్లతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రుణమాఫీపై అందజేసిన జాబితాపై చంద్రబాబు వారితో చర్చలు జరిపారు.

తెలంగాణ టిడిపి నేతల భేటీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం సమావేశం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపె, రాజకీయ పరిస్థితులు, రైతు సమస్యలపై చర్చలు జరుగుతున్నట్లు తెలియవచ్చింది.

గత కొద్ది రోజులుగా తెలంగాణలో టీడీపీని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ రాజకీయలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెరాసను పార్టీని ఏ విధంగా ఎదుర్కొవాలి, ఆ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపై తెలంగాణ తెలుగుదేశం నేతలకు చంద్రబాబు నాయుడు దిశ నిర్దేశం చేస్తున్నట్లుగా తెలియవచ్చింది.

English summary
Tollywood hero Ram Charan Tej met Andhra Pradesh CM Nara Chandrababu Naidu. Krishna river board chairman Pandit also met Chandrababu on Srisailam issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X