వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబాయ్ దారి బాబాయ్‌దే, నేను నాన్న వైపే: చెర్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన బాబాయ్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెడతారనే విషయంపై కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు, తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తేజ స్పందించారు. ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. బాబాయ్ దారి బాబాయ్‌దే, తన దారి తనదేనని ఆయన అన్నారు.

తన మద్దతు నాన్నగారికే ఉంటుందని ఆయన చెప్పారు. ఆ రకంగా ఆయన చిరంజీవికి మద్దతు ప్రకటించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజకీయాలపై తనకు అవగాహన లేదని ఆయన అన్నారు. ఎవరి దారులు వారికి ఉంటాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు .

Ram Charan Tej

ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాన్న కోసం ప్రచారం చేశానని ఆయన చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాయ్, నాన్న అనే విషయం వచ్చినప్పుడు తాను నాన్న వైపే ఉంటానని రామ్ చరణ్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెడుతున్నట్లు గత కొద్ది రోజులుగా మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వైపు నుంచి పార్టీ పెడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు రానప్పటికీ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఆయన ఈ నెల 14వ తేదీన పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు.

English summary
Union minister Chiranjeevi's son and Telugu film hero Ram Charan Tej said that he will not support his uncle Pawan kalyan's political party. He will support his father Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X