• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహేష్ బాబు సినిమా కలెక్షన్ల కోసమని అనగలను, అవి వింటే మూర్చపోతారు: పవన్‌కు వర్మ

By Srinivas
|

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేసి ఎవరో తిట్టిన విషయమే మీకు ఎక్కువ జాతీయ సమస్య అయిందా అని మండిపడ్డారు. మీడియాలో మీటింగ్‌లకు బదులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలని శ్రీరెడ్డికి చెప్పారని, మరి ఇప్పుడు మీరు అదే పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

  ఫిల్మ్‌ ఛాంబర్‌కు క్యూ కట్టిన మెగా ఫ్యామిలీ...!

  నీ తిండికి రూ.30 కోట్లా? దారుణం.. ఎన్టీఆర్ డూప్ డైలాగ్.. బాబు నవ్వులు: రోజా ఆగ్రహం

  ప్రత్యేక హోదా కంటే లీగలైజేషన్ ఆఫ్ ప్రాసిట్యూషన్ అనే టాపిక్ ఎక్కువ అయిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న రోజే మీరు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. మీరు ప్రస్తావించిన వాళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సురేష్ బాబు కొడుకు విషయంలో రూ.5 కోట్లు ఇప్పిస్తానని శ్రీరెడ్డికి చెప్పానని అన్నారు. ఈ మేరకు పవన్ వేసిన ట్వీట్‌లకు ఒక్కొ దానికి సమాధానం ఇచ్చారు.

   భరత్ అనే నేను కలెక్షన్లు తగ్గించేందుకు అని నేను అనగలను

  భరత్ అనే నేను కలెక్షన్లు తగ్గించేందుకు అని నేను అనగలను

  'పవన్ కళ్యాణ్ CBNని ఉద్దేశించి

  ''మీ ప్రభుత్వం రావటానికి అండగా నిలబడినందుకు ప్రతిఫలంగా మీ కొడుకు అతని స్నేహితులు ఆధ్వర్యంలో 6 నెలలుగా మీ మీడియా సంస్థాలైన TV9 ABN ANDHRA JYOTHI ద్వారా నా మీద అత్యాచారం జరుపుతూ వచ్చారు ..దాంట్లో భాగంగానే..10 కోట్లు ఖర్చు పెట్టి నాకు సంబంధంలేని విషయాల్లోకి నన్ను లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా బూతు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యూలేషన్లో పెట్టారు.. Ram gopal Varma, Tv 9 owner srini raju, Ravi Prakash, Lokesh Naidu, అతని ఫ్రెండ్ Rajesh kilaru కలిసి చేయిస్తున్నారని మీకు తెలియదంటే నన్ను నమ్మమంటారా

  రామ్ గోపాల్ వర్మ: పవన్ కళ్యాణ్ గారు,నేను విశ్వ ప్రసిద్ధ రచయిత ఆగతా క్రిస్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన కాన్స్పిరసీ థియరీ చదవలేదు .. ఇప్పుడు మీరు అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్ CBN స్పెషల్ స్టేటస్ దీక్ష నుంచి డైవర్ట్ చెయ్యడానికి భరత్ అనే నేను కలెక్షన్స్ తగ్గించడానికని నేనూ అనగలను కానీ అనను. మీడియాలో మీటింగ్లు బదులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని శ్రీరెడ్డి కి సలహా ఇఛ్చిన మీరు అదే పని మీరెందుకు చేస్తున్నట్టు ? అదలా ఉంచితే, అసలు ఏ.పి స్పెషల్ స్టేటస్ కంటే లీగలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్ ముఖ్యమయ్యిందా అని మీరు అడిగినప్పుడు, ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్ వ్యక్తి తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లో ఒక మూకుమ్ముడి ముఠా అయితే అయ్యుండచ్ఛేమో నాకు తెలియదు గాని, నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు.. మీరన్న దానికి పాయింట్లు గా నా వివరణ ఇస్తాన' అని పేర్కొన్నారు.

   సురేష్ బాబు కొడుకు విషయంలో వర్మ ఏం చెప్పారంటే?

  సురేష్ బాబు కొడుకు విషయంలో వర్మ ఏం చెప్పారంటే?

  సురేష్ బాబు కొడుకు అభిరాం మీద ఇంకా ప్రొసీడ్ అవ్వకపోతే నాలుగో ఐదో కోట్లు ఇప్పిచించటానికి ట్రై చేస్తానని శ్రీరెడ్డికి చెప్పాను కానీ మిమ్మల్ని తిట్టానికి కాదు..ఇది నేను రిలీజ్ చేసిన వీడియోలోచాలా క్లియర్ గా వుంది.

   శ్రీరెడ్డి క్యారెక్టర్ గురించి చెప్పేందుకే

  శ్రీరెడ్డి క్యారెక్టర్ గురించి చెప్పేందుకే

  ఈ విషయం నేను ప్రస్తావించిన సందర్భం, అంత డబ్బు ఆఫర్ ఇచ్చినా వద్దన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలపటానికి.

  నాకు నేనే క్షమాపణ చెప్పాను

  నాకు నేనే క్షమాపణ చెప్పాను

  పెద్దవాళ్ళని అన్నప్పుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన సత్యం.. మహేష్ కత్తి example ఇచ్చి తనకి సలహా ఇచ్చింది నేను.. ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది వేరెవరో ఇన్వెస్టిగేషన్ చేసి బయటకి తియ్యలేదు... ఎవరూ అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాను.

   పవన్ కళ్యాణ్ తల్లి విషయం

  పవన్ కళ్యాణ్ తల్లి విషయం

  ఇక పోతే మీ అమ్మగారిని తిట్టటమన్నది కరక్ట్ కాదు.. ఆ పదానికి అర్థం అమ్మ గురించి కూడా అలా ఆలోచించే ఒక మగాడిని వర్ణించడం.. అది చాలా విరివిగా సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా వాడే పదం.. అమ్మని తిట్టేది సినిమాలలో కూడా చాలా విరివిగా వాడే ల.. కొడుకు అనే పదం.

  మీ ఫ్యాన్స్ తిట్టే తిట్లు వింటే మూర్చపోతారు.మీకదే మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్ మీడియాలో మీ ఫాన్స్ వాడే తిట్లు వింటే మీరు మూర్ఛచిపడిపోతారు.

   అలా తిడితే మీ క్రెడిబులిటీ తగ్గిపోతుందా?

  అలా తిడితే మీ క్రెడిబులిటీ తగ్గిపోతుందా?

  ఒకవేళ నిజంగా నేను, మీరన్న మిగతా ఆ కూటమి కలిసి ఆ అమ్మాయికి 5 కోట్లు ఇఛ్చి తిట్టించమనుకుందాం .. కేవలం క్రెడిబిలిటీ లేని ఒక మామూలు అమ్మాయి మిమ్మల్ని ఆ పదం వాడి తిడితే దాని మూలాన ఎవరికి ఏం లాభం వస్తుంది..మీ అంత సూపర్ స్టార్ లీడర్ ని రోడ్డు మీద ఒక తిట్టు తిడితే ఆ తిట్టులో వున్న అర్ధం నిజమనుకుంటారా? ,మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుందా ? మీ కొచ్చే ఓట్లు తగ్గిపోతాయా?

  7.ఈ విషయంలో మీరు వూహించుకుంటున్న పేర్లగల వారెవరూ లేరు..ఇది కేవలం నా ఒక్కడి తప్పే అని ఇంకొకసారి చెప్పి 20వ సారి మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటున్నాను

   పవన్ చనిపోవడం వ్యాఖ్యలపై వర్మ సమాధానం

  పవన్ చనిపోవడం వ్యాఖ్యలపై వర్మ సమాధానం

  పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను, ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే.. మీరు గుర్తుంచుకోవాల్సింది"నేను ఎంతోకొంత నిస్సహాయులకు అండగా.. అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు."

  దానికి రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. కళ్యాణ్ గారు, హీరో అయినా మీరు మీ శత్రువులని చంపాలి కానీ మీ చావు గురించి మాట్లాడటం మీకు తగదు.. మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్గా నాకు బాధ కలిగిస్తోంది. రేపు ఒక రాష్ట్రానికి నాయకుడిగా పోటీ చేయబోయే మీరు.. ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ మీరు వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నమ్మకాలను పెట్టుకున్న కోట్లమంది మీ అభిమానులకు కానీ మంచిది కాదు అని నా ఉదేశ్యం... అని వర్మ ముగించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Director Ram Gopal Varma answers to Jana Sena chief Pawan Kalyan over his comments.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more