వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతిభ్రమించింది: రాం గోపాల్ వర్మపై ఊగిపోయారు, 'రంగాను కించపరుస్తారా..'

వంగవీటి చిత్రంలో చలసాని వెంకటరత్నం పాత్రను కించపరిచేలా చిత్రీకరించారని సిపిఐ నేత దోనెపూడి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వంగవీటి సినిమా విషయమై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన పలువురు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వంగవీటి చిత్రంలో చలసాని వెంకటరత్నం పాత్రను కించపరిచేలా చిత్రీకరించారని సిపిఐ నేత దోనెపూడి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'వంగవీటి'లో ఆ సన్నివేశాలు తొలగించకుంటే..: వర్మపై హెచ్చార్సీలో ఫిర్యాదు

రామ్ గోపాల్ వర్మకు మతిభ్రమించిందన్నారు. ప్రజల కోసం పోరాడిన నేతను మద్యానికి బానిసగా చూపించారని మండిపడ్డారు. వంగవీటి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

దిష్టిబొమ్మ దగ్ధం

Vangaveeti Ranga Fans burned Ram Gopal Varma effigy in Tanuku on Monday.

వంగవీటి చిత్రంలో వంగవీటి రంగా కుటుంబీకులను కించపరిచేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు సంఘ నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రంగా అభిమానులు ఆందోళన చేపట్టారు.

సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్‌ వద్ద దర్శకుడు వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రంగా 28వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా కుటుంబీకులను కించపరిచేలా సినిమా తీసిన వర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Vangaveeti Ranga Fans burned Ram Gopal Varma effigy in Tanuku on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X