• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీ మీద ఒట్టు ... అది జనసేన కాదు.. పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదు అంటున్న ఆర్జీవీ

|

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈనెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎవరు ఎన్ని కేసులు వేసినా, ఎంత విమర్శలు చేసినా ఏ సినిమా తీసినా ఆయన రూటే సపరేటు. అంతే కాదు ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా తిప్పికొట్టటంలో ఆయనకు ఆయనే సాటి. ఇక తాజాగా పొలిటికల్ సెటైరికల్ సినిమాగా వివాదాస్పద కథని ఎంచుకుని వర్మ ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను తన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు .

రీ ఎంట్రీ ఇచ్చిన కేఏ పాల్ ... కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పై హైకోర్టులో పిటీషన్ పాల్ ... నేడే విచారణ

 కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సినిమా పాత్రలు ఫేమస్ వ్యక్తులను పోలి ఉండటం యాదృచ్చికం

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సినిమా పాత్రలు ఫేమస్ వ్యక్తులను పోలి ఉండటం యాదృచ్చికం

ఇక ఆ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ సినిమాలో ఉన్న పాత్రలన్నీ యాదృచ్చికంగా ఫేమస్ వ్యక్తులను పోలి వున్న పాత్రలని ఆయన చెప్పారు. ఏపీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఏపీలో రాజకీయ దుమారం రేగింది. ప్రధాన పార్టీల నేతలను, వారి హావభావాలను ఆర్జీవీ తన సినిమాలో, తన కోణంలో చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ పాత్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లా ఉండటంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వర్మ పవన్ ను టార్గెట్ చేశారా అని ఆగ్రహంతో ఉన్నారు.

సినిమాలో ఉంది జనసేన కాదు అది మనసేన అన్న ఆర్జీవీ

సినిమాలో ఉంది జనసేన కాదు అది మనసేన అన్న ఆర్జీవీ

ఇక ఈ నేపధ్యంలో మీడియా సమావేశంలో దీనిపై ఆర్జీవీ మాట్లాడారు . సినిమాలో జనసేన లేదని, అది మనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు. అలాగే జనసేన పార్టీకి మన సేన పార్టీ కి సంబంధం లేదని, సినిమాలోని మన సేన పార్టీ కి పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదని వర్మ తనదైన శైలిలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్ర చిత్రంలో ఉండటం యాదృచ్చికం అన్నారు . మీ మీద ఒట్టు జనసేనకు పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదు అంటూ పదేపదే ఆసక్తికర వ్యాఖ్య చేశారు రాం గోపాల్ వర్మ .

ఇది పొలిటికల్ సెటైర్ మాత్రమే అన్న రాం గోపాల్ వర్మ

ఇది పొలిటికల్ సెటైర్ మాత్రమే అన్న రాం గోపాల్ వర్మ

ఈ సినిమా మొత్తం జగన్ మోహన్ రెడ్డి కు ఫేవరబుల్ గా ఉందని చర్చ జరుగుతుందంటే దానికి సమాధానంగా వర్మ ఇది కేవలం పొలిటికల్ సెటైర్ అన్నారు. పొలిటికల్ అంశాలపై తనకు అవగాహన లేదని అవి బాగా అర్థం కూడా కావన్నారు. జనం చూసిన దాన్నే తాను ఈ సినిమాలో చూపిస్తున్నానని, కొత్తగా ఏం చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. ట్రైలర్‌లో చూపించినట్టుగా కూర్చో అని జగన్ తిట్టడం, కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే ఎవరూ భయపడరని చెప్పడం లాంటివే జనానికి గుర్తుంటాయని చెప్పిన వర్మ మిగిలిన చర్చ ఎవరికీ పట్టదన్నారు.

ఏదైనా తప్పుంటే దేవుడు నన్ను శిక్షించుగాక అంటూ వర్మ వ్యాఖ్యలు

ఏదైనా తప్పుంటే దేవుడు నన్ను శిక్షించుగాక అంటూ వర్మ వ్యాఖ్యలు

చేసేదంతా చేసి టీడీపీ టార్గెట్ గా చంద్రబాబును, లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని సినిమా తీసి ఇది కేవలం కల్పితం అని చెప్పటం వర్మకే చెల్లుబాటు అయ్యింది. అసెంబ్లీలో జరిగే చర్చల్లో 90శాతం సామాన్యుడికి అర్థం కావన్న వర్మ , తనకు అర్ధం కావు అని చెప్తూనే ఏపీ రాజకీయాలలో తన సినిమాతో వేడి పుట్టిస్తున్నారు. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే.. మీతోడు.. ఇది పొలిటికల్ సెటైర్ మాత్రమే. కొంతమంది ఫేమస్ వ్యక్తులను పోలి ఉండటం యాదృచ్ఛికం మాత్రమే. ఏదైనా తప్పుంటే దేవుడు నన్ను శిక్షించుగాక అంటూ ముగించారు ఆర్జీవీ . మొత్తానికి ఆయన ఏం చేశారో తెలిసి కూడా వర్మ అబ్బే అదేంలేదు అని చెప్పటం మీ మీద ఒట్టు అని వ్యాఖ్యానించటం గమనార్హం .

English summary
Kama rajyam lo Kadapa Redlu will come out in front of the audience on the 29th of this month. The film revolves around AP politics and has already provoked political tension. RGV is going to show the leaders of the major parties and their gestures in his film . Pawan fans and Jana Sena activists are angry that Varma Pawan has been targeted because of the role of Janasena chief Pawan Kalyan in the film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X