హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుష్కరాల పేరుతో కలుషితం చేస్తున్నారు: ట్వీటెత్తిన రాంగోపాల్ వర్మ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివాదస్పద ట్వీట్లు చేస్తూ ఎప్పుడూ మీడియా నోళ్లలో నానుతూ ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి వ్యక్తులను కాకుండా పుష్కరాలను లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ అక్కడి నదుల్ని పరిశుభ్రంగా ఉంచుకుని మరింత అభివృద్ధి చెందుతున్నాయి. మన దేశంలో మాత్రం పుష్కారాల పేరుతో నదుల్ని కలుషితం చేస్తున్నారు' అని వర్మ తన తాజా ట్వీట్‌తో దేశ ప్రజలపై మండిపడ్డాడు. కాగా, వర్మకి ఇంత దేశభక్తి ఎక్కడ్నుంచి వచ్చిందబ్బా! అంటున్నారు ట్వీట్ చూసిన వాళ్లు.

ఇది ఇలా ఉండగా, ఇటీవల రాంగోపాల్ వర్మ రాజమండ్రి తొక్కిసలాట ఘటనపైనా తన ట్విట్టర్ ఖాతాలో పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన తొక్కిసలాట గురించి ట్విట్టర్ స్పందిస్తూ.. ‘పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే.. దేవుడ్ని నిందించకుండా, చంద్రబాబును నిందించడమేంటి?' అని వ్యాఖ్యానించారు.

Ram Gopal Varma on Pushkaralu

అంతటితో ఆగకుండా.. ‘పుష్కరాల్లో అంతమంది భక్తులు చనిపోతుంటే.. దేవుడే ఎందుకు కాపాడలేదు. ఎందుకంటే.. చనిపోయిన వారందరూ బతికున్న వారికంటే తక్కువగా ప్రార్థించారు' అని చెప్పారు. పుష్కరాల తొలి రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది భక్తులు తమ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

English summary
Famous Director Ram Gopal Varma responded on Godavari Pushkaralu through twitter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X