వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఎన్నో డౌట్స్: రాకేష్‌రెడ్డికి అంతుందా? బ్రదర్ అనిల్ తమసోమాపై ట్విస్ట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చుట్టూ రాజకీయ వివాదం ముసురుకుంటోంది. ఈ చిత్రాన్ని సీఎం చంద్రబాబును, టిడిపిని లక్ష్యంగా చేసుకొని నిర్మించే అవకాశముందని భావిస్తున్నారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చుట్టూ రాజకీయ వివాదం ముసురుకుంటోంది. ఈ చిత్రాన్ని సీఎం చంద్రబాబును, టిడిపిని లక్ష్యంగా చేసుకొని నిర్మించే అవకాశముందని భావిస్తున్నారు.

ఆపెయ్, లేకుంటే: వర్మకు వాణీవిశ్వనాథ్ హెచ్చరిక, అల్లుళ్లపై ఏం చెప్పారంటే: లక్ష్మీపార్వతి షాకింగ్ఆపెయ్, లేకుంటే: వర్మకు వాణీవిశ్వనాథ్ హెచ్చరిక, అల్లుళ్లపై ఏం చెప్పారంటే: లక్ష్మీపార్వతి షాకింగ్

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి వైసిపి నేత రాకేష్ రెడ్డి నిర్మాత కావడం, వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాన్ని సినిమా తీస్తానని వర్మ ప్రకటించడం వివాదానికి కారణమైంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్: వర్మ కొత్త కోణం లాగుతారా, టిడిపిలో అందుకే ఆందోళనా?లక్ష్మీస్ ఎన్టీఆర్: వర్మ కొత్త కోణం లాగుతారా, టిడిపిలో అందుకే ఆందోళనా?

తాజాగా, వైసిపి అధినేత వైయస్ జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్‌ను వర్మ కలిశారనే విషయం వెలుగు చూసింది. దీంతో వర్మ చిత్రంపై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. కచ్చితంగా చంద్రబాబును టార్గెట్‌గా సినిమా తీస్తున్నారని అంటున్నారు.

బ్రదర్ అనిల్‌ను వర్మ ఎక్కడ కలిశారు?

బ్రదర్ అనిల్‌ను వర్మ ఎక్కడ కలిశారు?

బ్రదర్ అనిల్ కుమార్‌ను రామ్ గోపాల్ వర్మ హైదరాబాదులోని ఓ హోటల్లో శుక్రవారం రహస్యంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య చర్చ జరిగింది. ఈ భేటీలో జగన్ పెదనాన్న కొడుకు అనిల్ రెడ్డి, సినిమా నిర్మాత రాకెష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Recommended Video

Roja Character in Lakshmi's NTR రోజా ఏమన్నారంటే..? | Oneindia Telugu
రాకెష్ రెడ్డి వెనుక ఎవరు?

రాకెష్ రెడ్డి వెనుక ఎవరు?

వర్మ దర్శకత్వం వహించే ఈ సినిమాకు రాకేష్ రెడ్డి నిర్మాతగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. వర్మ వంటి డైరెక్టర్ చిత్తూరు జిల్లాలోని రాకేష్ రెడ్డి వంటి చిన్న నిర్మాత ఇంటికి వెళ్లి సినిమాపై ప్రకటన చేయడం అనుమానం కలిగించేదే అంటున్నారు. దీంతో రాకేష్ రెడ్డి వెనుక ఎవరో ఉండి ఉంటారనే చర్చ సాగుతోంది.

తెరముందు రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ

తెరముందు రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ

వర్మ తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి తెర ముందు నిర్మాతగా రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ తెరవెనుక కచ్చితంగా ఎవరో ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఈ సినిమాకు తెర వెనుక జగన్ ఉన్నారా అని ఇటీవల ప్రశ్నిస్తే.. లక్ష్మీపార్వతి కొట్టిపారేశారు. అయితే రాకేష్ రెడ్డికి అంత ఆర్థికస్థోమత ఉందా అనే చర్చ సాగుతోంది.

చంద్రబాబును ఇబ్బందులు పెట్టే ప్రయత్నం

చంద్రబాబును ఇబ్బందులు పెట్టే ప్రయత్నం

ఈ సినిమాలో రోజా కూడా నటించే అవకాశాలు కొట్టి పారేయడం లేదు. ఏ పరంగా చూసినా అది వైసిపి నుంచి వస్తున్న సినిమాగా కనిపిస్తోంది. కాబట్టి కచ్చితంగా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నారని, ఎన్నికలకు ముందు ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

వైయస్ పైన తమసోమా జ్యోతిర్గమయ?

వైయస్ పైన తమసోమా జ్యోతిర్గమయ?

తాజాగా, తమసోమా జ్యోతిర్గమయ అనే కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ పేరుతో బ్రదర్ అనిల్ కుమార్ సినిమా తీయాలనుకుంటున్నారని, తద్వారా హిందువులకు జగన్‌ను దగ్గర చేయాలనుకుంటున్నారనే ప్రచారం సాగింది. అయితే దీని వెనుక మరో కోణం ఉందని కూడా అంటున్నారు. అసలు వైయస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని కొన్ని అంశాలను సృషిస్తూ ఆయనను గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటే ఎలా ఉంటుందనే చర్చ వారి మధ్య జరిగినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.

బాలకృష్ణకు కౌంటర్‌గా

బాలకృష్ణకు కౌంటర్‌గా

ఎన్టీఆర్ పైన సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించడం, వెంటనే వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించడం చూస్తుంటే.. బాలకృష్ణ సినిమాకు కౌంటర్‌గా దీనిని తీసుకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలో ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని చూపిస్తే, వర్మ సినిమాలో చంద్రబాబును టార్గెట్ చేస్తారని అంటున్నారు.

English summary
A proposed biopic on NT Rama Rao’s life by filmmaker Ram Gopal Varma has kicked off a controversy in Andhra Pradesh. Varma has announced the film on the Telugu film legend and TDP founder’s last few years and it has not gone down well with the ruling Telugu Desam Party (TDP) as certain episodes in NTR’s late life are historically uncomfortable for its current leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X