వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాంగోపాల్ వర్మ ఇంతే: టీచర్లను కించపర్చేలా ట్వీట్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను తీసిన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ రెడ్డి ఉపాధ్యాయుల దినోత్సవమైన (సెప్టెంబర్ 5) సోమవారం నాడు ఉపాధ్యాయులపైనే తనదైన శైలిలో స్పందించారు. వర్మ వ్యాఖ్యలు కొంత వెటకారంగా, ఉపాధ్యాయులను అగౌరవపర్చిలా ఉండటంతో పలువురు నెటిజన్లు వర్మపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అందరూ ఈ రోజును ఎంతో పవిత్ర దినంగా జరుపుకుంటుండగా.. రాంగోపాల్ వర్మ మాత్రం ఉపాధ్యాయులను కించపర్చేలా ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు.

ఆ ట్వీట్ల సారాంశంల్లోకి వెళితే.. స్కూల్లో టీచర్లతో సమయం వృథా చేసుకోవద్దనీ, కేవలం గూగుల్ నుంచే నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించాడు. అంతేగాక, తాను టీచర్లందర్నీ ద్వేషించేవాడిననీ, అందుకే క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వల్ల తాను ఇంత పెద్ద దర్శకుడినయ్యానంటూ తన గొప్పలు చెప్పుకున్నాడు వర్మ.

Ram Gopal Verma on Teachers day

తన టీచర్లందరికంటే తానే ఎక్కువ విజయాలు సాధించానని, తనకు తన టీచర్ల కంటే అన్నింటి గురించి ఎక్కువే తెలుసునని చెప్పాడు. టీచర్లు చెప్పినవాటి కంటే క్లాసులో గొడవల నుంచే తాను ఎక్కువగా నేర్చుకున్నానని, వాటిలో తాను తిరగబడే మనస్తత్వంతో శివ, సత్య లాంటి సినిమాలు తీశానని చెప్పుకొచ్చాడు.

తనను క్లాసులో కామిక్ పుస్తకాలు చదవనివ్వకపోవడమే.. తాను టీచర్లను ద్వేషించడానికి ప్రధాన కారణమని చెప్పాడు. స్కూలు, కాలేజీలో కొందరు టీచర్లు తనతో బలవంతంగా చదివించేవాళ్లని, జీవితంలో అత్యంత దారుణమైన రోజులవేనని తెలిపాడు.

ప్రతిరోజూ స్కూలులో పాఠాలు అయిపోయిన తర్వాత, వాళ్లు చెప్పినవి మర్చిపోవడానికి రెండు కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు చదివేవాడినని చెప్పుకొచ్చాడు. తనను చాలా సార్లు టీచర్లు కొట్టారని, డస్టర్ తో ఓ టీచర్ కొట్టడంతో తన తల పోయిందని వెటకారంగా చెప్పుకొచ్చాడు. అంతేగాక, తాను సాధారణంగా విస్కీ తాగనని, కానీ, టీచర్స్ విస్కీ మాత్రం తాగుతానంటూ ఆ బాటిళ్లను కూడా ట్విట్టర్‌లో పోస్టు చేశాడు ఈ దర్శకుడు.

English summary
Director Ram Gopal Verma responded on Teachers day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X