గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ గెలుపు కోసం మోడీ, షా, రాహుల్ కీ రోల్, కాంగ్రెస్ చీడపురుగు, ఎన్ని ఫ్రంట్లోచ్చినా..: రాంమాధవ్

|
Google Oneindia TeluguNews

గుంటూరు: నాలుగేళ్ల తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ దేశంలో అందరికంటే ఎక్కువగా ఉందని బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ అన్నారు. గుంటూరు సిద్ధార్థ్‌ గార్డెన్స్‌లో మోడీ ప్రభుత్వ విజయోత్సవ సభలో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సభలో రాంమాధవ్ మాట్లాడుతూ.. యూపీఏ పాలన మొత్తం కుంభకోణాల మయమేనని అన్నారు.

కానీ, ఎన్డీయే హయాంలో ఎలాంటి మచ్చలేని పరిపాలన అందిస్తున్నామని చెప్పారు. మోడీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని ఓ విదేశీ జర్నలిస్టు కూడా ప్రశంసించారని ఈ సందర్భంగా రాంమాధవ్ తెలిపారు.

ఒకరు థర్డ్ ఫ్రంట్.. మరొకరు ఫొర్తు ఫ్రంట్

ఒకరు థర్డ్ ఫ్రంట్.. మరొకరు ఫొర్తు ఫ్రంట్

ప్రజాసేవే పరామర్థంగా మోడీ పాలన సాగుతోందని అన్నారు. అవినీతికి తావివ్వకపోవడంతో కొందరికి అన్‌కంఫర్టబుల్‌ ఉందని అన్నారు. ఎన్ని ఫ్రంట్లు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేవని రాంమాధవ్ అన్నారు. ఒకరు థర్డ్ ఫ్రంట్ అంటారు.. మరొకరు ఫోర్త్ ఫ్రంట్ అంటున్నారని తెలుగు రాష్ట్రాల సీఎంలనుద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. మోడీకి ధీటైన ప్రతిపక్షం దేశంలో లేదని అన్నారు.

దేశానికి పట్టిన చీడ పురుగు కాంగ్రెస్..

దేశానికి పట్టిన చీడ పురుగు కాంగ్రెస్..

స్వాతంత్ర్యం తర్వాత దేశానికి పట్టిన చీడ పురుగని కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు రాంమాధవ్. 70శాతం ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారని, దేశంలోని 60శాతం భూభాగం బీజేపీ పాలనలో ఉందని రాంమాధవ్ చెప్పారు.

 కర్ణాటకలో మరో 3,4నెలలు

కర్ణాటకలో మరో 3,4నెలలు

కర్ణాటకలో కొద్దిలో మిస్ అయిపోయిందని, అయితే, మరో 3,4 నెలలు వెయిట్ చేయాల్సి ఉందని రాంమాధవ్ అన్నారు. కుమారస్వామి ఒకే కానీ, అస్థిర కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసిపోయారని అన్నారు. అవినీతి రాజకీయాలకు భిన్నంగా నూతన రాజకీయాల కోసం మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. కొత్త ఇండియాను, యునైటెడ్ ఇండియాను తీసుకొద్దామని అన్నారు. సౌత్‌ను వేరుగా చూస్తున్నారని కొందరు అంటున్నారని, అయితే బీజేపీ వేర్పాటు రాజకీయాలను ఎప్పుడూ అంగీకరించబోదని స్పష్టం చేశారు.

బలమైన భారత్ కోసం..

బలమైన భారత్ కోసం..


బలమైన భారతదేశం, ప్రపంచం గౌరవించే భారతదేశంగా నిలబెట్టేందుకు మోడీ కృషి చేస్తున్నారని రాంమాధవ్ చెప్పారు. చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలో 160జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేదని, ఇప్పుడు అది 20జిల్లాలకే తమ ప్రభుత్వం పరిమితం చేసిందని అన్నారు. మావోయిస్టు ముక్త్ భారత్ చేస్తోందని అన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని రాంమాధవ్ చెప్పారు

ఆసియాలోనే భారత్ నెం.1

ఆసియాలోనే భారత్ నెం.1

ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ అవతరిస్తోందని, 7.5శాతం జీడీపీతో ఆసియాలోనే నెంబర్ వన్‌గా భారత్ ఉందని రాంమాధవ్ తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని తెలిపారు. స్కిల్ ఇండియా, ముద్ర యోజన, మేకిన్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలతో దేశంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.

టార్గెట్ 2022

టార్గెట్ 2022

‘2022నాటికి దేశంలో పేదరికం ఉండకూడదు. ఇల్లు లేని కుటుంబాలు ఉండకూడదు. ప్రతీ కుటుంబానిక ఇల్లు, నిరుద్యోగం ఉండకూడదు. అభివద్ది చెందిన దేశంగా భారత్.. ఇది మోడీ ఆశయం' అని రాంమాధవ్ చెప్పారు. 2022నే ఎందుకు పెట్టుకున్నామంటే అప్పటికి మన దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు.

బీజేపీని గెలిపించే నేతలు మోడీ, అమిత్ షా, రాహుల్

బీజేపీని గెలిపించే నేతలు మోడీ, అమిత్ షా, రాహుల్


2019లో బీజేపీ వస్తుందా? అని కొందరు శంఖ వ్యాధిగ్రస్తులకు అనుమానం కలుగుతోందని.. అయితే తమ ప్రభుత్వమే గ్యారంటీగా వస్తుందని రాంమాధవ్ స్పష్టం చేశారు. బీజేపీ గెలుపు కోసం ముగ్గురు నేతలు పనిచేస్తున్నారని..వారిలో ఒకరు నరేంద్ర మోడీ.. మరొకరు అమిత్ షా అయితే ఇంకొకరు రాహుల్ గాంధీ అని చెప్పారు.

మతతత్వ పార్టీనా?

కులాల పేరుతో రాజకీయాలు చేస్తూ బీజేపీని మతతత్వ పార్టీ అనే అర్హత ఎవరికీ లేదని అన్నారు. కొందరు మతతత్వ పార్టీ అంటున్న బీజేపీ.. ముస్లింలు ఎక్కువగా ఉన్న జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఉందని, 90శాతానికిపైగా క్రైస్తవులు ఉన్న నాగాలాండ్‌లోనూ బీజేపీ ప్రభుత్వం ఉందని, బౌద్ధులున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపీదే ప్రభుత్వమని, సిక్కులు ఎక్కువగా ఉన్న పంజాబ్ లో కూడా మొన్నటి వరకు తమ ప్రభుత్వమే ఉందని రాంమాధవ్ చెప్పారు.

English summary
BJP leader Ram Madhav satires on Congress president Rahul Gandhi, that Rahul will play key role in BJP winning 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X