రామతీర్థం: జగన్ సర్కారు కీలక నిర్ణయం -విగ్రహ పున:ప్రతిష్ట -నెలలో ఆలయ ఆధునీకరణ -దర్యాప్తు సీఐడీకి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామతీర్థం ఆలయ విధ్వంసం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన మూడు రోజులుగా రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోన్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.
రాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణు

విగ్రహ పున:ప్రతిష్ట
విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ప్రధాన ఆలయానికి అనుబంధంగా బోడికొండపై కొలువైన 400 ఏళ్ల కిందటి కోదండరాముడి విగ్రహం తలను దుండగులు ఖండించడం తెలిసిందే. గత మంగళవారం ఉదయం ఆలయ అర్చకులు ఈ దురాగతాన్ని గుర్తించగా, కొద్ది గంటలు ఆలస్యంగా స్వామివారి తలను గుర్తించారు. ఈ ఘటనపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు నడిచాయి. వివాదాల సంగతి ఎలా ఎన్నా, ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే..
రామతీర్థంలో రాముడి విగ్రహం పున:ప్రతిష్టించాలని జగన్ సర్కారు నిర్ణయించింది.

నెల రోజుల్లోనే ఆధునీకరణ కూడా..
రామతీర్థం ఆలయంలో ధ్వంసమైన విగ్రహం స్థానంలో కొత్త ప్రతిమను పున:ప్రతిష్టచడంతోపాటు ఆలయాన్ని బోడికొండ, కిందున్న ప్రధాన ఆలయాన్ని కూడా ఆధునీకరించాలని కూడా ప్రభుత్వం డిసైడైంది. దీనికి సంబంధించి ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. వివిధ శాఖల అధికారులు, పండితుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయాన్ని ఆధునీకరించడతో పాటు.. కేవలం నెల రోజుల్లో రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

రామతీర్థం విధ్వంసం కేసు సీఐడీకి
సీఎం జగన్ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజా శంకర్, దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్లు, ఆర్ జేసీలు, డీసీలు హాజరయ్యారు. రామతీర్థం ఘటనతో పాటు ఇతర ప్రాంతాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమీక్ష అనంతరం.. రాముడి విగ్రహ ధ్వంసం కేసును సీఐడీకి అప్పగించారు. ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయిచింది. అలాగే..

రామతీర్థంపై రాజకీయాలొద్దు..
రాముడి విగ్రహం ఘటనపై రాజకీయ పార్టీలు ఉద్రిక్తంగా వ్యవహరిస్తుండటంపై జగన్ సర్కారు తీవ్రంగా స్పందించింది. రామతీర్థ ఆలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని.. దీని వెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి అన్నారు. రామతీర్థంపై రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు సూచించారు. రామతీర్థం చాలా చిన్న ప్రాంతమని.. అక్కడ ర్యాలీలు చేయవద్దని బీజేపీ, జనసేన పార్టీలకు సూచించారు. దోషులను రెండురోజుల్లోనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీలో బండి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? -ఢిల్లీలో సోము వీర్రాజు, సంజయ్ -నడ్డాతో కీలక భేటీ -వ్యూహాత్మకంగా