తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నా జూనియర్, మంచి స్నేహితుడు: రమణదీక్షితులు ఆసక్తికరం, బాబుపై ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ ప్రధాని అర్చకులు రమణదీక్షితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎంతో మంచి వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు.

Recommended Video

రమణదీక్షితులు సవాల్: నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా?
కొంతమంది వల్లే బాబుకు దూరం..

కొంతమంది వల్లే బాబుకు దూరం..

చంద్రబాబు తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఎస్వీ యూనివర్సిటీలో తనకు జూనియర్ అని రమణదీక్షితులు తెలిపారు. చంద్రబాబుతో తనకు మంచి సంబంధాలు ఉండేవని, అయితే, కొంతమంది ప్రోద్బలంతోనే ఆయన తనకు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

మా ఇద్దరి ఆలోచనలు కూడా..

మా ఇద్దరి ఆలోచనలు కూడా..

అయితే, చంద్రబాబు మనసులో మాత్రం ఏమీ లేదని చెప్పారు. తామిద్దరం శ్రీవేంకటేశ్వరుడి భక్తులమే అని రమణదీక్షితులు చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి ఆలోచనలు కూడా ఒకటేనని తెలిపారు.

చంద్రబాబు అలా.. నేను ఇలా..

చంద్రబాబు అలా.. నేను ఇలా..

రాజకీయ నాయకుడిగా రాష్ట్రమంతా బాగుండాలని చంద్రబాబు కోరుకుంటారని.. స్వామివారి అర్చకుడిగా తాను కొండపై అంతా బాగుండాలని తాను కోరుకుంటానని రమణదీక్షితులు తెలిపారు.

 రమణదీక్షితులు ఆవేదన

రమణదీక్షితులు ఆవేదన

చంద్రబాబును కలిసేందుకు గతంలో తాను చాలాసార్లు ప్రయత్నించానని, అయితే, అపాయింట్‌మెంట్ ఇచ్చి కూడా తనను వెనక్కి పంపారని రమణదీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గత కొంతకాలంగా టీటీడీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల రమణదీక్షితులు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు చంద్రబాబుపై ప్రశంసాపూర్వక వ్యాఖ్యాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

English summary
TTD former priest Ramanadeekshitulu on Wednesday praised Andhra Pradesh CM Chandrababu naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X