వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో రామరాజ్యం ప్రారంభమైంది .. జగన్ సీఎం కావటంపై రమణ దీక్షితులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు . రమణ దీక్షితులు తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ విజయం సాధించటంపై సంతోషం వ్యక్తం చేశారు.

<strong>పసుపు కుంకుమ తీసుకుని మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారు .. రోజా తీవ్ర వ్యాఖ్యలు</strong>పసుపు కుంకుమ తీసుకుని మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారు .. రోజా తీవ్ర వ్యాఖ్యలు

 జగన్ సీఎంగా సుదీర్ఘ కాలం కొనసాగుతారన్న రమణ దీక్షితులు

జగన్ సీఎంగా సుదీర్ఘ కాలం కొనసాగుతారన్న రమణ దీక్షితులు

రమణ దీక్షితులు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం వైఎస్‌ జగన్‌ కొనసాగుతారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోయిందని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రాదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇక తన అర్చకత్వం గురించి మాట్లాడుతూ తన వంశపారంపర్య హక్కును తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా కాలరాసిందని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ బ్రాహ్మణులకు అండగా నిలిచారని, వంశపారంపర్యం కొనసాగిస్తామని మాట ఇచ్చారని వైఎస్‌ జగన్‌ మాట తప్పరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

టీటీడీ జేఈ ఓపై ఆరోపణలు గుప్పించిన రమణ దీక్షితులు .. తనకు తిరిగి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

టీటీడీ జేఈ ఓపై ఆరోపణలు గుప్పించిన రమణ దీక్షితులు .. తనకు తిరిగి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

ఇక తనకు టీటీడీలో ఉన్న జేఈఓ శ్రీవారి కైంకర్యాలకు ఆటంకం కలిగించారని ఆరోపణలు గుప్పించారు. అలాంటి వారిని సాగనంపాలని రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా శ్రీవారి కైంకర్యాలకు దూరం కావడం బాధకలిగించిందని తెలిపారు. తిరిగి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని నూతన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కోరుతున్నట్లు వెల్లడించారు. బ్రాహ్మణులంటే గౌరవం ఉన్న అధికారులనే టీటీడీలో అధికారులుగా నియమించాలని ఆయన జగన్ కు విజ్ఞప్తి చేశారు.

గతంలో టీడీపీ హయాంలో టీటీడీపై సంచలన ఆరోపణలు చేసిన రమణ దేక్షితులు

గతంలో టీడీపీ హయాంలో టీటీడీపై సంచలన ఆరోపణలు చేసిన రమణ దేక్షితులు

టీడీపీ హయాంలో టిటిడిలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించినందునే తనపైన వేటు వేశారని మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు టీటీడీలో స్వామి వారి ఆభరణాలపై, వెయ్యి కాళ్ళ మండపం గురించి వ్యాఖ్యలు చేశారు. మైసూరు మహారాజులు ఇచ్చిన ఆభరణాల్లో ఐదు పేట్ల ప్లాటినం హారంలో గులాబీ రంగు వజ్రం ఉండేదని, అయితే గరుడ సేవలో భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందని రికార్డుల్లో రాశారని చెప్పుకొచ్చారు. అసలు వజ్రం నాణేలు తగిలి పగిలిపోయిందని చెప్పడం అసంబద్దంగా ఉందని, దాని విలువ వందల కోట్లలో ఉంటుందని అన్నారు. ఇటీవల జనీవాలో వేలం వేసిన వజ్రం ఇక్కడిదే అయి ఉండచ్చొని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు టీటీడీ ఆభరణాలవిషయంలో పెద్ద వివాదమే చెలరేగింది.

English summary
Ramana Deekshitulu , the former Chief Priest of the TTD, said that the evil's rule of democracy in Andhra Pradesh was ruined and Ramarajyam was started. Speaking to reporters in Tirumala, Ramana Deekshitulu said, "he is happy with the success of Jagan . Ramana Deekshitulu said that YS Jagan will continue as the Chief Minister for a long time. TDP government made this state in drought conditions , Ramana Deekshitulu said that Jagan is not going to maintain the state in the same drought situations . Talking about his priesthood, he claimed that his legacy was against the constitution of the TDP government. YS Jagan said that he was behind the Brahmins and that YS Jagan's words were meant to be fulfilled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X