• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒకే సినిమాకు పవన్ కళ్యాణ్- రాంచరణ్: భారీ బడ్జెట్ మూవీ: జనసేనాని పాలిటిక్స్‌కు దూరమేనా..?

|

హైదరాబాదు: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. జనసేన కార్యకర్తలకు ఒక్కింత బ్యాడ్ న్యూస్. త్వరలోనే బాబాయ్ కోసం అబ్బాయ్ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నిర్మించనున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది.. ఇది నిజమేనా..?

సినిమాల పైనే పవన్ కళ్యాణ్ ఫోకస్..?

సినిమాల పైనే పవన్ కళ్యాణ్ ఫోకస్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రమంగా రాజకీయాలకు దూరమవుతున్నారా... అంటే చాలామంది పవన్ అభిమానులు ఔననే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సంఘటనలు జరిగినా.. రాజకీయపరమైన అంశాలు వెలుగుచూసినా కేవలం ట్విటర్ ద్వారానే పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు కూడా ఒక్కింత అసహనంతో ఉన్నారు. ఏపీలో మిగతా పార్టీలు దూసుకుపోతుంటే జనసేన మాత్రం వెనకపడిపోయిందనే చెవులు కొరుక్కుంటున్నారు. ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారన్న మాట కార్యకర్తల వద్ద వినిపిస్తోంది. రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్‌ను చూసే వారు మాత్రం అతనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా... సినిమా కోణంలో పవర్ స్టార్ వైపు చూస్తున్న వారు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ సినిమాను నిర్మిస్తున్న చరణ్..?

పవన్ సినిమాను నిర్మిస్తున్న చరణ్..?

ఇక రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను కాసేపు పక్కనపెట్టి సినిమాల గురించి మాట్లాడుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను అబ్బాయ్ రాంచరణ్ నిర్మిస్తున్నట్లు ఫిలింనగర్‌లో వార్త హల్చల్ చేస్తోంది. ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌ను పంచుకోనప్పటికీ... ఒక సినిమా బాబాయ్ అబ్బాయ్‌ల కలయికలో రావడాన్ని ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ అటు రాంచరణ్ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. అదే సమయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తలు మాత్రం ఇది నిజమే అని నిర్థారిస్తున్నాయి.

  కాశీ, అయోధ్య వంటి హిందూ యాత్రలకు డబ్బులు ఇవ్వారా ? | Janasena | BJP | Pawan Kalyan | Oneindia Telugu
  సినిమా హిట్ అయితే లాభాల నుంచి వాటాలు

  సినిమా హిట్ అయితే లాభాల నుంచి వాటాలు


  మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్‌కు నిర్మాణ రంగంలో కాస్త అనుభవం ఉంది. తన తండ్రి నటించిన రెండు భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఖైదీ నెం 150, సైరా చిత్రాలను రాంచరణ్ నిర్మించాడు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై నిర్మించారు. తాజాగా బాబాయ్‌ పవన్ కళ్యాణ్ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌తో కలిసి నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను రాంచరణ్ నిర్మిస్తే విడుదల తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటారన్న వార్త కూడా వినిపిస్తోంది. ఇక పవర్ స్టార్ సినిమా అంటే మామూలుగా ఉండదు. స్టోరీ కుదరకపోయినా సినిమా హిట్ అనే భావించాలి. అంతలా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు పవన్ ఇచ్చే హైలెవెల్ కాన్ఫిడెన్స్ కూడా అదే. ఒకవేళ పవన్ సినిమా బాగలేకపోయినా నష్టాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉండవు అనేది ఇండస్ట్రీ టాక్.

   రాజధానుల విషయంలో...

  రాజధానుల విషయంలో...

  ఇక జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ విషయానికొస్తే... ఏపీలో మాత్రం జనసేనాని అడుగుపెట్టకపోవడంపై ఇటు కార్యకర్తలు అటు ప్రజలు ఒక్కింత అసంతృప్తితో ఉన్నారు. అసలే ఏపీలో భారీ వర్షాలు కురిసి కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తడంపై కేవలం ట్విటర్ ద్వారానే పవన్ స్పందించడాన్ని కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకున్నారు. ఇక క్రమంగా కొందరు పార్టీ పెద్దలు జనసేనను వీడుతుండటంపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఇక బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత రాజధాని అంశంపై రెండు పార్టీల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. రాజధాని కేంద్రం పరిధిలో రాదని బీజేపీ ప్రభుత్వం చెప్పడం.. అదే రాజధానిపై బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండటంతో కాస్త విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది.


  మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెడుతుండటంతో జనసేన పార్టీ నుంచి క్రమంగా ఇతర పార్టీలోకి వలసలు పెరుగుతాయని సమాచారం. ఇప్పటికే పలువురు పార్టీ పెద్దలు జనసేనను వీడి వారి రాజకీయ జీవితంకు ఫుల్ స్టాప్ పడుకుండా జాగ్రత్త పడ్డారు.

  English summary
  Pawan Kalyan's next movie will be produced by Mega powerstar RamCharan if sources are to be believed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X