వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు తొందరపాటు, జగన్! మీరైనా రండి: ఎన్డీయేలోకి కేంద్రమంత్రి ఆహ్వానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు నాయుడుకు కేంద్రమంత్రి విజ్ఞప్తి

అమరావతి: ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడం తొందరపాటు చర్య అని, బాధాకరమని కేంద్రమంత్రి రామదాస్ అథవాలే గురువారం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్డీయేలో చేరాలని ఆయన హితవు పలికారు. లేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా చేరాలన్నారు.

ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరిగి ఎన్డీయేలో చేరితే స్వాగతిస్తామని అథవాలే అన్నారు. టీడీపీ చేరకుంటే వైసీపీ చేరవచ్చునని వెల్లడించారు. అయితే ఎన్నికలకు ముందా తర్వాత అనేది వారి ఇష్టానికి వదిలేస్తున్నామని చెప్పారు.

సింగపూర్‌ను ఎలా నిర్మించాలో తెలుసుకోండి: పవన్ చురక, 'ఆయనతో శాంతిభద్రతల సమస్య'సింగపూర్‌ను ఎలా నిర్మించాలో తెలుసుకోండి: పవన్ చురక, 'ఆయనతో శాంతిభద్రతల సమస్య'

చంద్రబాబు నాయుడుకు కేంద్రమంత్రి విజ్ఞప్తి

చంద్రబాబు నాయుడుకు కేంద్రమంత్రి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్టానికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అథవాలే తెలిపారు. ఏపీకి అన్యాయం చేయమని వెల్లడించారు. తాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.

ఇదే నా సూచన

ఇదే నా సూచన

చంద్రబాబుకు ఇది తన సూచన అని అథవాలే అన్నారు. 2019లో తిరిగి కచ్చితంగా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఎన్డీయేలో కలవడం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇది తన సూచన అన్నారు. ఠలేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ అయినా చేరాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ కేసు విషయమై సుప్రీం కోర్టు తీర్పుపై..

ఎస్సీ, ఎస్టీ కేసు విషయమై సుప్రీం కోర్టు తీర్పుపై..

ఎస్సీ, ఎస్టీ కేసు విషయమై కూడా రామదాస్ అథవాలే స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు అసమంజసంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ రివ్యూ పిటిషన్ వేసిందన్నారు. దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు.

ఎన్టీఆర్ సిద్ధాంతాలతో టీడీపీలో న్యాయం

ఎన్టీఆర్ సిద్ధాంతాలతో టీడీపీలో న్యాయం

అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీపడదని కేంద్రమాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు వేరుగా అన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలతో టీడీపీలో అందరికీ న్యాయం జరుగుతోందన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు.

English summary
Union Minister Ramdas Athawale appeals Andhra Pradesh CM Chandrababu Naidu and YSRCP chief YS Jagan to join NDA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X