వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేస్తే ఏపీకీ హోదా ఖాయం: చ‌ంద్ర‌బాబు చేసిన త‌ప్పు చేయ‌ద్దు : ఎన్డీఏలోకి జ‌గ‌న్‌కు ఆహ్వానం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అలాచేస్తే ఏపీకి హోదా ఖాయం చ‌ంద్ర‌బాబు చేసిన త‌ప్పు చేయ‌ద్దు

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఎన్డీఏలో చేరాల‌ని కేంద్ర మంత్రి ఆహ్వానించారు. గ‌తంలో చంద్ర‌బాబు చేసిన త‌ప్పు చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. మోదీ ప్ర‌భుత్వానికి మద్ద‌తు ప్ర‌క‌టించిన ఏపీకీ ప్ర‌త్యేక హోదా సాధించుకోవాల‌ని కేంద్ర మంత్రి రాందాస్ అథేవలే మార్గ‌ద‌ర్శ‌కం చేసారు. అయితే, ఎన్డీఏలో చేరే విష‌యం పైన ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు ఆహ్వానం వ‌చ్చినా..ఆయ‌న నిర్ణ‌యం తీసుకోలేదు. తాజాగా మ‌రోసారి కేంద్ర మంత్రి సూచ‌న పైన వైసీపీ ఏలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

చంద్ర‌బాబు చేసిన త‌ప్పు చేయ‌ద్దు..
ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకోవాలని కేంద్ర మంత్రి రాందాస్ అథేవ‌లే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు సూచించారు. మోదీకి వ్యతిరేకంగా వ్యవహరించవద్దని మాజీ సీఎం చంద్రబాబుకు స్వయంగా చెప్పానని, కానీ ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి, సొంతరాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయారని అన్నారు.

Ramdas Athevale invited AP CM jagan into NDA. He suggested Jagan support Modi and get Special status

చంద్రబాబు చేసిన తప్పు చేయొద్దని, మోదీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని జగన్‌కు ఆయన హితవు పలికారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని, చాలా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతూ ఉండటమే ఇందుకు కారణమన్నారు . అయితే, హోదా విష‌యంలో గ‌తం కంటే ఒక కేంద్ర మంత్రి ఇలా సానుకూలంగా స్పందించ‌టంతో ఇప్పుడు వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

జ‌గ‌న్ ఎన్డీఏలోకి వెళ్తారా..
ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత హోదా సాధ‌న కోసం ఎలా ముందుకెళ్తార‌నేది ఆస‌క్తి క‌రంగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వంలో ఎవ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేకుండానే మోదీ ప్ర‌భుత్వం పూర్తి మెజార్టీ సాధించింది. ఇక‌, వైసీపీ మ‌ద్ద‌తు వారికి అవ‌స‌రం లేదు. ఇదే స‌మ‌యంలో ఎన్డీఏ మిత్ర‌ప‌క్షంగా ఉండ‌మ‌ని జ‌గ‌న్‌కు ఇప్ప‌టికే ఆహ్వానం అందింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం ఎన్డీఏలో చేర‌టం వ‌ల‌న లాభం కంటే నష్ట‌మే ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌త్యేక హాదా పైన ఎటువంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా ఎన్డీఏలో చేరితే టీడీపీ చేతికి అస్త్రం ఇచ్చిన‌ట్లువుతుంద‌ని భావిస్తున్నారు. ఇక‌, త‌న‌తో క‌లిసి వ‌చ్చే పార్టీలతో క‌లిసి మోదీ పైన ఒత్తిడి తెచ్చి ప్ర‌త్యేక హోదా సాధించ‌టం మిన‌హా జ‌గ‌న్ ముందు మ‌రో ప్ర‌త్యామ్నాయం లేదు. దీంతో..ఆయ‌న ఎన్డీఏలో చేరాలంటే ప్ర‌త్యేక హోదా పైన సానుకూల నిర్ణ‌యం వ‌స్తేనే సాధ్య‌మ‌ని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

English summary
Central Minister Ramdas Athevale invited AP CM jagan into NDA. He suggested Jagan support Modi and get Special status for AP. He also advised Jagan do not behave like Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X