వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ఈసిగా రమేష్ కుమార్ తొలగింపు .. ప్రజా స్వామ్యం ఖూనీ అని ప్రతిపక్షాల విమర్శలు

|
Google Oneindia TeluguNews

ఒకపక్క దేశం కరోనాతో వణుకుతున్న సమయంలో తెలుగు రాష్ట్రమైన ఏపీలో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటంతో ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారిగా ఖంగు తిన్నాయి. ఇప్పటికే చాల సందర్భాల్లో చెయ్యకూడని తప్పులు చేసి కోర్టులో చీవాట్లు తిన్న సీఎం జగన్ కు ఇది పరిపాటిగా మారిందని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నుండి కన్నా , సీపీఐ నుండి నారాయణ , కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ శైలజానాథ్ లు ఏపీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు.

సీఎం జగన్ పరిపాలనా అసమర్థత వల్లే ఇదంతా : నారా లోకేష్సీఎం జగన్ పరిపాలనా అసమర్థత వల్లే ఇదంతా : నారా లోకేష్

ఇప్పటికే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఎస్‌ఈసీ తొలగింపు పై నిప్పులు చెరిగారు. ఇక తాజాగా ఎస్‌ఈసీ తొలగింపు జగన్‌ నియంతృత్వపు పోకడలకు పరాకాష్ఠ అని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్విటర్‌లో మండిపడ్డారు. తన నిర్ణయానికి అడ్డువచ్చిన వారెవరూ ఉండకూడదన్న మనస్తత్వంతోనే జగన్ ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇక రాష్ట్రంలో తాజా పరిస్థితి ఆందోళనకరమన్నారు నారా లోకేష్ . రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించటం కక్ష పూరిత చర్య అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ శైలజానాథ్ . ప్రభుత్వంఈ తరహా ఆర్డినెన్స్‌ను తీసుకురావడం సీఎం నిరంకుశత్వానికి నిదర్శనమని పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ విమర్శించారు.

Ramesh Kumar suspended as SEC..Opposition criticism on ycp government

తన మాట విననందుకే టార్గెట్ చేసుకుని మరీ జగన్‌ ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని అన్నారు. గతంలో పలు విషయాల్లో ఇలాగే నిర్ణయాలు తీసుకుంటే కోర్టు అక్షింతలు వేసిందని ఆయన విమర్శించారు. వ్యక్తిగత ప్రతీకారంతో ముఖ్యమంత్రి జగన్‌ తీసుకొచ్చిన ప్రతిపాదిత ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు కన్నా లక్ష్మీ నారాయణ . ఎన్నికలు వాయిదా వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ ఆర్డినెన్స్‌ను తిరస్కరించండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు కన్నా లక్ష్మీనారాయణ.

English summary
Already Chandrababu and Pawan Kalyan have fired on SEC suspension issue . "The latest SEC elimination is a pinnacle of the Jagan dictatorial trends," said TDP National Secretary General Lokesh on Twitter. Jagan is committing these kinds of actions with the mentality of not wanting anyone to resist his decision. Nara Lokesh says the latest situation in the state is worrisome.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X