వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్‌కు ఫోన్, బాబుకు మోడీ షాకిచ్చారా?: ఏమైనా జరగొచ్చునని..
అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి, టిఆర్ఎస్లు ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు పలుకుతున్నాయి. తెలంగాణను పక్కన పెడితే, ఏపీలో ఈ అంశం కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చనీయంశమైంది.
భాగ్యనగరంలో భోజనం.. అమరావతిలో టీ: కోవింద్ రాకకై...
ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తామని వైసిపి మొదటి నుంచి చెబుతోంది. అలాగే, నాలుగో సెట్ నామినేషన్ కోసం వైసిపి ప్రజాప్రతినిధులను ఢిల్లీ పెద్దలు పిలిపించుకున్నారు. వైసిపి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నాలుగో సెట్‌పై వెంకయ్య తర్వాత, రెండో వ్యక్తిగా సంతకం చేశారు.