• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు రాజకీయానికి రంగనాయకమ్మ, డాక్టర్‌ సుధాకర్‌ బలయ్యారన్న లక్ష్మీ పార్వతి

|

వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయాలకు అనవసరంగా రంగానాయకమ్మ, అలాగే డాక్టర్ సుధాకర్ బలవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చంద్రబాబు సేవలు అవసరం లేదని, ప్రజలు చంద్రబాబును ఎప్పుడో మర్చిపోయారన్నారు లక్ష్మీ పార్వతి.

కళ్లు మండుతున్నాయా అన్నది నిన్నే బాబూ.. ఆశపడి భంగపడ్డారా : చంద్రబాబుపై విజయసాయి

జూమ్ నాయకుడిగా మారిన చంద్రబాబు

జూమ్ నాయకుడిగా మారిన చంద్రబాబు

చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదన్న లక్ష్మీ పార్వతి , చంద్రబాబు రాజకీయాలు మానుకొని రామా-కృష్ణా అంటూ రామాయణం, భారతం చదువుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు దుర్బుద్ధి వల్లే అడ్రెస్ లేకుండా పోయాడని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 25ఏళ్లు గడిచాయన్నారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. చంద్రబాబు జూమ్ మీటింగ్ లు పెడుతూ జూమ్ నాయకుడిగా మారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు.

జగన్ వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలు అమలు

జగన్ వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలు అమలు

ఇక చంద్రబాబు పాలనలో సాధించిందేమీ లేదని ,ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని ఆమె మందిపద్ద్రు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో ఏడాదిలోనే ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశారని కొనియాడారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘనవిజయం సాధించి శనివారం నాటికి ఏడాది పూర్తవుతుందని తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్‌ తండ్రిలా సేవ చేస్తున్నారని ఆమె కొనియాడారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక విషయాల్లో జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెట్టరా?

ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెట్టరా?

చంద్రబాబు రాజకీయానికి రంగనాయకమ్మ, డాక్టర్‌ సుధాకర్‌ బలయ్యారని వ్యాఖ్యానించిన లక్ష్మీ పార్వతి డాక్టర్‌ సుధాకర్‌, రంగనాయకమ్మ టీడీపీ సానుభూతి పరులని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసమే డాక్టర్ సుధాకర్ ఉద్యోగానికి రాజీనామా చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రంగనాయకమ్మ టీడీపీ సానభూతి పరురాలని, టీడీపీకి అనుకూలంగా సోషల్‌మీడియాలో ఆమె ప్రచారం చేస్తున్నారని అలాంటి ఆమెను సామాజిక కార్యకర్తగా టీడీపీ నాయకులు మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెట్టరా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 66 యేళ్ల మహిళపై కేసు పెట్టారంటూ గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులకు నాడు తన మీద చేసిన ప్రచారం గుర్తు లేదా అని ప్రశ్నించారు .

  YSR Rythu Bharosa : Good News For AP Farmer,Govt Supplying Seeds From Today Onwards!
  గత ఎన్నికల సమయంలో తనను ఘోరంగా అవమానించారని గుర్తు చేసిన లక్ష్మీ పార్వతి

  గత ఎన్నికల సమయంలో తనను ఘోరంగా అవమానించారని గుర్తు చేసిన లక్ష్మీ పార్వతి

  60 యేళ్ల మహిళ అయిన తనపై టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని, ఎన్టీఆర్‌ భార్య అయిన తనను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి అనే వ్యక్తికి 25 లక్షలు ఇచ్చి టీవీ ఛానెల్‌లో డిబేట్‌ పెట్టినప్పుడు మహిళ సంఘాల నేతలు ఏమయ్యారని ప్రశ్నించారు. అప్పుడు ఎవరు నోరు మెదపలేదని, ఇప్పుడు మాత్రం టీడీపీ నేతలు కుక్కల్లాగా మొరుగుతున్నారన్నారు. ఇక ఇదంతా టీడీపీ రాజకీయం అని , చంద్రబాబు రాజకీయాలకు చాలా మంది బలైపోతున్నారని వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి అసహనం వ్యక్తం చేశారు.

  English summary
  YCP leader and Telugu Academy Chairperson Lakshmi Parvathi criticized the former CM Chandrababu Naidu. She said that Ranganayakamma and Dr Sudhakar are unnecessarily facing controversies with Chandrababu's politics. Lakshmi Parvati said that the state does not need Chandrababu services and people have forgotten Chandrababu ever since.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more