వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంగారెడ్డిలో హైడ్రామా: తెరాస ఖాతాలోకి వరంగల్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Rangareddy ZP election postponed: Warangal may be in TRS fold
రంగారెడ్డి: రంగా రెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక హైడ్రామా మధ్య రేపటికి వాయిదా పడింది. రేపు ఒంటి గంటకు ఎన్నిక జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 33 జెడ్పీస్థానాలు ఉండగా, కాంగ్రెసుకు 14, తెరాసకు 12, టిడిపికి 7 స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

కాంగ్రెస్, టిడిపి ఓ అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు ప్రతిపాదనలను ఇరు పార్టీ మధ్య చెర్చలు జరుగుతున్నాయి. జెడ్పీ పీఠాన్ని చెరో రెండేళ్లు పంచుకోవాలనేది మొదటి ప్రతిపాదన కాగా, మహబూబ్‌నగర్, వరంగల్ జెడ్పీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు, టిడిపి సహకరిస్తే, అందుకు ప్రతిఫలంగా రంగారెడ్డి జెడ్పీ పీఠం టిడిపికి దక్కేలా కాంగ్రెస్ సహకరించాలనేది రెండో ప్రతిపాదనగా తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్రతిపాదనలపై చర్చలు కొలిక్కి రానట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెసు, టిడిపి జడ్పిటీసిలు గైర్హాజరయ్యారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది.

ఇదిలావుంటే, వరంగల్ జడ్పీ చైర్మన్ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఖాతాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 50 జడ్పీటిసి స్థానాలు ఉండగా, కాంగ్రెసు 24 స్థానాలు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి ఆరు స్థానాలున్నాయి. టిడిపి మద్దతుతో జడ్పీ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవాలని కాంగ్రెసు భావించింది.

అయితే, కాంగ్రెసుకు వ్యతిరేకంగా పరిస్థితి మారిపోయింది. 18 జడ్పిటీసి స్థానాలు గెలుచుకున్న తెరాస చైర్మన్ పదవిని కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది మంది కాంగ్రెసు జడ్పిటీసీలు, నలుగురు టిడిపి జడ్పీటీసిలు తెరాసకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దీంతో వరంగల్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Rangareddy Zilla Parishad chairman election postponed. Meanwhile, Telangana Rastra Samithi (TRS) may win Warangal ZP chairman election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X