మత్తు మందిచ్చి మహిళ నగ్న ఫొటోలు తీసి రేప్, వేధింపులు: వైసీపీ నేతపై కేసు నమోదు
నెల్లూరు: మాయమాటలు చెప్పి తనను గర్భవతిని చేసి మోసం చేశాడని నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డివిజన్ కో-ఆర్డినేటర్ కృష్ణారెడ్డిపై ఓ యువతి ఆరోపించింది. పోలీసులతోపాటు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది బాధితురాలు.
వివరాల్లోకి వెళితే.. వైసీపీ నేత కృష్ణారెడ్డి కడప జిల్లాకు చెందిన ఓ మహిళతో ఫేస్బుక్ ప్రేమ వ్యవహారం నడిపాడు. మహిళను కలవడానికి పిలిచి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా చేసి ఫొటోలు తీశాడు కృష్ణారెడ్డి. ఆ ఫొటోలు బయటపెడతానని బెదిరింపులకు గురిచేసి.. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో.. గర్భం తీయించాడు కృష్ణారెడ్డి. ఆ తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇద్దరికీ వివాహం చేశారు పెద్దలు. అయితే, ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశాడు కృష్ణారెడ్డి. ఆమె హత్యకు కూడా ప్రయత్నించాడు.
ఈ క్రమంలో నిందితుడు కృష్ణారెడ్డిపై హైదరాబాద్‌లోనూ పోలీసులు కూడా నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని బాధిత మహిళ మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ)ని ఆశ్రయించింది. ప్రస్తుతం వారి పర్యవేక్షణలోనే ఉంది.

కాగా, కృష్ణారెడ్డి అరాచకాలు తెలియడంతో వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పదవి నుంచి ఆ పార్టీ అధిష్టానం తొలగించింది. కృష్ణారెడ్డి సొంత గ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం.