6వ తరగతి బాలికపై రేప్‌యత్నం, టూర్‌కు వెళ్లిన టెక్కీ గల్లంతు

హైదరాబాద్: హైదరాబాదులోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఒక పాఠశాలలో ఆరవ తరగతి విద్యార్థిని పైన అత్యాచారయత్నం జరిగింది. ఈ సంఘటన పైన పాఠశాల కార్యాలయం ఇంఛార్జిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలుస్తోంది.

టెక్కీ అదృశ్యం

విహారయాత్రకు వెళ్ళిన వారిని విషాదం చుట్టుముట్టింది. హైదరాబాద్ నుంచి కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌కు వెళ్లారు. దయ్యాలగండి వద్ద కృష్ణానదిలో జలకాలాటలకు దిగారు. వీరిలో బీహార్‌కు చెందిన విశ్వజిత్ నదిలో మునిగి గల్లంతయ్యాడు. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో విశ్వజిత్ పని చేస్తున్నారని సమాచారం.

చలితీవ్రతతో ఇద్దరు మృతి

Rape attempt on 6th class student

కరీంనగర్‌ జిల్లాను చలి వణికిస్తోంది. చలికి తట్టుకోలేక జిల్లాలో వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మల్యాల మండలంలోని రామన్నపేటకు చెందిన వృద్ధురాలు నేరెళ్ల రాజవ్వ(96) ఆది వారం తెల్లవారుజామున మృతి చెందింది. రామగుండం కార్పొరేషన్‌ 43వ డివిజన్‌లోని అల్లూరులో చలితీవ్రతను తట్టుకోలేక శనివారం రాత్రి వృద్ధురాలు కొడిపెల్లి సమ్మమ్మ(60) మరణించింది.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

వివిధ దొంగతనాల కేసులతో సంబంధ మున్న అంతర్రాష్ట్ర దొంగలముఠాను ఆదివారం విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం వన్‌టౌన్‌ పరిధిలో ఇటీవల వరుసగా జరిగిన తొమ్మి ది చోరీకేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

వీరిలో చత్తీస్‌‌గఢ్‌కు చెందిన సంతోష్‌ అలియాస్‌ లంబూ, దివాకరరావుతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన కాళీప్రసాద్‌ ఉన్నారు. ఈ ముగ్గురిలో భిలాయికు చెందిన ఇద్దరికి నేరచ రిత్ర ఉంది.

ఇంకోవ్యక్తి కాశీప్రసాద్‌పై శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో అనేక కేసులు నమోదై ఉన్నాయి. నిందితుల నుంచి రూ. 25 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనపరుచుకున్నామని ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రావెల్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+