• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అత్యాచార భారతం .. నాలుగేళ్ల చిన్నారిపై , 10ఏళ్ళ బాలికపై లైంగిక దాడి

|

బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. బుద్ధుడు పుట్టిన పుణ్యభూమిలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, మనుషుల్లో రోజురోజుకీ పెరుగుతున్న పశు ప్రవృత్తిని తేటతెల్లం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న అత్యంత పాశవికంగా ఒక బాలికను చిత్రహింసలకు గురి చేసి రేప్ చేసిన ఉదంతం మరిచిపోకముందే, అన్యం పుణ్యం ఎరుగని పసికందులను కామాంధులు చిదిమేస్తున్న సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటుంటేమన దేశం ఎటువైపు పయనిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇది మన అత్యాచార భారతం అని చెప్పాల్సిన దుస్థితి.

నాలుగేళ్ల చిన్నారిపై ఘాతుకం

నాలుగేళ్ల చిన్నారిపై ఘాతుకం

గుంటూరు జిల్లా గురజాల మండలం నాలుగేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం సెలవుదినం కావడంతో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని 45 ఏళ్ళ వయసున్న ముత్తన నాగిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకు వెళ్లి తలుపులు వేసాడు చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడ, ఇక్కడ వెతికి చివరికి నాగిరెడ్డి ఇంటి తలుపులు కొట్టారు. మద్యం మత్తులో తలుపులు తీసిన నాగిరెడ్డి ఇంట్లో మంచం పైన చిన్నారి ఉండటం చూసి అనుమానించిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చిన్నారిని గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలికపై పైశాచికం .. జనానాంగంపై బ్లేడుతో కోసి రేప్.. యూట్యూబ్ లో వీడియో

5వతరగతి విద్యార్థిని రేప్.. సహవిద్యార్థుల ఘాతుకం

5వతరగతి విద్యార్థిని రేప్.. సహవిద్యార్థుల ఘాతుకం

ఇక ఇదే జిల్లాలో దాచేపల్లి మండలం లో మరో ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సహవిద్యార్థులు అత్యాచారానికి పాల్పడినట్టు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం రోజు పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని, తిరిగి ఏ సమయమైనా ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడ అపస్మారకస్థితిలో ఉన్న కుమార్తెను చూశారు. ఇంతకీ ఆమె స్పృహలోకి రాకపోవడంతో ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక చెప్పిన విషయాన్ని విని నిర్ఘాంతపోయారు. తనతో నిద్ర మాత్రలు మింగించి తన సహ విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడినట్టు బాలిక చెపింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్ని చట్టాలు ఉన్నా బాలికలకు రక్షణ కరువేనా ?

ఎన్ని చట్టాలు ఉన్నా బాలికలకు రక్షణ కరువేనా ?

ఇలా రోజుకో చోట పసి మొగ్గలను చిదిమేస్తుం టే , బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిర్భయ వంటి కఠినతరమైన చట్టాలు ఉన్నా కామాంధులకు భయం లేదని అర్థమవుతుంది. చట్టపరమైన శిక్షలు విధించి టమే కాకుండా పాఠశాల విద్య నుండి విద్యార్థుల్లో నైతికత పెంపొందించేలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పు తీసుకు రాగలిగితే కొంతమేరకైనా ఈ అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ అత్యాచార భారతం సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది.

English summary
A four -year-old girl was allegedly raped by her neighbour who took her to his home on the pretext of playing with her. this incident took place at Gurajala, Guntur district in Andhrapradesh. and one more incident also happened in the same district . A girl who is studying 5th class was also raped by the classmates. They gave her sleeping pills when she is in intoxication the classmates raped her . police filed cases on these incidents and investigating them .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X