వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు.. కిటకిటలాడుతున్న ప్రసిద్ధ క్షేత్రాలు

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ , తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో సోమవారం అర్ధరాత్రి నుండే వేడుకలు ప్రారంభమయ్యాయి.తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.మాఘ శుధ్ద సప్తమి సూర్య జయంతి రోజు రధ సప్తమి నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రథ సప్తమి నాడు ప్రాతః కాల సూర్యకిరణాలచే పుణ్య క్షేత్రాలు మహా మహిమాన్వితంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి.

రథ సప్తమి నాడు శోభాయమానంగా మలయప్ప దర్శనం

రథ సప్తమి నాడు శోభాయమానంగా మలయప్ప దర్శనం

మలయప్ప స్వామి శోభాయమానంగా ఏడు వాహనాలపై ఊరేగుతూ తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తున్నారు. వాహన సేవల్లో ఉత్సవ మూర్తులను తిలకించేందుకు సోమవారమే వేలాదిగా భక్తులు తిరుమల చేరుకున్నారు.తిరుమాడ వీధుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రథసప్తమి ఒక్కరోజే 15 లక్షల మంది భక్తులు మలయప్ప స్వామిని దర్శించుకుంటారని టిటిడి అధికారులు చెబుతున్నారు.

మంగళవారం తెల్లవారుఝామున 4 గంటలకు మలయప్పస్వామి వాహన మండపానికి వేంచేయడంతో సప్తవాహన సేవలు మొదలయ్యాయి. మలయప్ప స్వామి వారు ఈ తెల్లవారు ఝూమన సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. 9 గంటలకు చిన శేషవాహనం పై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చి అనంతరం 11 గంటలకు కు గరుడవాహనం,మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, సాయంత్రం 4 కు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాలవాహనం, రాత్రి 8 నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారి ఊరేగింపు వేడుక శోభాయమానంగా జరుగుతోంది.

అరసవల్లి సూర్య నారాయణ దేవాలయంలో భక్తుల కిటకిట

అరసవల్లి సూర్య నారాయణ దేవాలయంలో భక్తుల కిటకిట

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అర్ధరాత్రి నుండే వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి పూజాదికాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు వేకువజామున స్వామివారి సుప్రభాత సేవ ప్రాతః కాల అర్చనతో పాటు స్వామివారికి మహాభిషేకాన్ని నిర్వహించారు. రథసప్తమి వేడుకలకు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు 1.5 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు .

విజయనగరం జిల్లాలోని సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

విజయనగరం జిల్లాలోని సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

విజయనగరం జిల్లాలోని బాబామెట్ట ఏడు కోవెల సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలతో పూజాధికాలు నిర్వహిస్తున్నారు. శృంగవరపుకోట పట్టణంలో ఉన్న సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సైతం భక్తులు బారులుతీరారు.

తెలంగాణాలోని ప్రసిద్ధ క్షేత్రాలలో రథ సప్తమి వేడుకలు

తెలంగాణాలోని ప్రసిద్ధ క్షేత్రాలలో రథ సప్తమి వేడుకలు

తెలంగాణ రాష్ట్రం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో రథసప్తమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. అలాగే వరంగల్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక సేవలతో స్వామివారి కైంకర్యాదులు నిర్వహిస్తున్నారు. వేయి స్తంభాల దేవాలయంలో సైతం రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకలతో అటు బాసర క్షేత్రం కొత్త కళను సంతరించుకుంది.
రథ సప్తమి నాడు ఆ సూర్య భగవానుని దయ ఉంటే సర్వ పాపాలు తొలగిపోయి, అనారోగ్య బాధలు తీరుతాయని ప్రతీతి.

English summary
Ratha Saptami Festival celebrating grandly in Telugu States, all temples in Telugu states rushed with huge number of devotees.The utsavams will be specially and traditionally celebrated on the occasion of Surya Jayanti Ratha Saptami in Tirumala the kaliyuga vaikunta. Lord of The Seven Hills participates in all the processions and also in all Vahana Sevas. in Srikakulam district arasavalli Suryanarayana Temple set all the arrangements for Ratha Saptami .According to the TTD, around 15 lakh devotees are have darshan lord venkatesha today and 1.5 lakh devotees are expected to have darshan surya narayana swamy at arasavelli .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X