వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ,తెలంగాణ లబ్దిదారులకు గుడ్ న్యూస్ .. వన్ నేషన్ వన్ రేషన్ లో ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ !!

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు తెలంగాణా ప్రజలు ఏపీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకుంటున్నారు . ఏపీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు తీసుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం అందించిన వన్ నేషన్ వన్ రేషన్ లో భాగంగా ఇప్పుడు ఎవరు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవడానికి అవకాశముంది. ఈ క్రమంలోనే తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ లను ఒక క్లస్టర్ గా గుర్తించిన కేంద్ర సర్కార్ ఇరు రాష్ట్రాలలో ప్రజలు ఎవరు ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు .

కృష్ణానదిపై మరో రెండు బ్యారేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌ .. తొలిదశ పరిపాలన ఉత్తర్వులనిచ్చిన ఏపీ సర్కార్కృష్ణానదిపై మరో రెండు బ్యారేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌ .. తొలిదశ పరిపాలన ఉత్తర్వులనిచ్చిన ఏపీ సర్కార్

ఏపీ , తెలంగాణా రాష్ట్రాలలో రేషన్ పోర్టబిలిటీ

ఏపీ , తెలంగాణా రాష్ట్రాలలో రేషన్ పోర్టబిలిటీ

ఒకే దేశం ఒకేసారి ఎన్నికల తరహాలో , ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గత ఏడాది జులైలో నిర్ణయం తీసుకున్న కేంద్రం ఈ విధానాన్ని ఈ ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఊహించని విధంగా వచ్చిన కరోనా కారణంగా ఆ ప్రక్రియలో జాప్యం జరిగినా, వన్ నేషన్ , వన్ రేషన్ దిశగా అడుగులు వేస్తుంది కేంద్రం. అయితే ఈ విధానం కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహించిన రేషన్ పోర్టబిలిటీ ట్రయల్ రన్ విజయవంతమైన కారణంగా ఇప్పుడు ఇరు రాష్ట్రాలలో ఎవరు ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది .

 గత ఏడాది నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ .. ఇప్పుడు పోర్టబిలిటీ విధానం అమల్లోకి

గత ఏడాది నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ .. ఇప్పుడు పోర్టబిలిటీ విధానం అమల్లోకి

ఏపీ, తెలంగాణ లతో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్ లను రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి గత ఏడాది ఆగస్టు 1వ తేదీ నుండి ఒకే దేశం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలనుకున్నారు అధికారులు. అయితే అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ట్రయల్ రన్ నిర్వహించారు. పంజాగుట్టలోని ఒక రేషన్ షాప్ లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు రేషన్ తీసుకున్నారు. తెలంగాణలో రేషన్ పోర్టబులిటీ సక్సెస్ అయిందని భావించి ఇక రెండు రాష్ట్రాల మధ్య పోర్టబిలిటీ డెవెలప్ చేశారు .ఇక ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసింది .

త్వరలోనే దేశ వ్యాప్తంగా అమలుకు యోచన

త్వరలోనే దేశ వ్యాప్తంగా అమలుకు యోచన

ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్రాల పరిధిలోని ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర సర్కార్ అంతర్రాష్ట్రాల్లోనూ అమలు చేస్తోంది. ఉపాధి పనుల నిమిత్తం ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుండి ఏపీకి వలస వెళ్లిన పేదలకు అంతరాష్ట్ర పోర్టబిలిటీతో రేషన్ సరుకులను అందిస్తోంది. దీనివల్ల నిరుపేదల రేషన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అమలవుతున్న ఈ విధానం సక్సెస్ అయితే, ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా అమలైతే ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Recommended Video

Rice Cards To Transgenders & Orphans : AP Govt ట్రాన్స్ జెండర్ లకు అండగా ఏపీ సర్కార్ || Oneindia
తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకున్న ఏపీ వాసులు

తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకున్న ఏపీ వాసులు

ఏపీలోని పలు జిల్లాలో రేషన్ కార్డులు ఉన్న 349 మంది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ తీసుకున్నట్లుగా సమాచారం..అదేవిధంగా ఏపీలోనూ పన్నెండవ విడత ఉచిత సరుకులు పంపిణీ కార్యక్రమంలో రేషన్ పోర్టబులిటీ ద్వారా ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మంది ప్రజలకు బియ్యంతో పాటు శనగలు ఉచితంగా ఇచ్చారు.ఇక 12 వ విడత ఉచిత సరుకులు పంపిణీ లో భాగంగా 1,50,80,690 బియ్యం కార్డుదారులకు రేషన్ అందింది. అంతరాష్ట్ర పోర్టబిలిటీ అమల్లోకి రావడంతో ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Now the people of Telangana are taking ration without any trouble in AP. AP people are taking ration goods without any difficulty in the state of Telangana. As part of the One Nation One ration provided by the Central Government, now anyone has the opportunity to take ration goods anywhere. In this context, the Central Government has identified Telangana and Andhra Pradesh as a cluster and has made it possible for people in both the states to take rations anywhere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X