వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారుంటే రేషన్ కార్డు గల్లంతే ...ఏపీలో మారిన రేషన్ రూల్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ration Rules Changed In AP : Who Is Eligible For Ration Cards || Oneindia Telugu

ఏపీలో జగన్ తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. అవినీతి రహిత పారదర్శక పాలనే ధ్యేయంగా పని చెయ్యాలని సంకల్పించిన జగన్ అన్ని శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇక పౌర సరఫరాల శాఖ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించిన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పారదర్శక పాలనను అందించాలని ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగా ఏపీలో రేషన్ రూల్స్ మార్చారు సీఎం జగన్ . ఏపీలో ఆహార భద్రత నియమాల్లో సవరణలు చెయ్యాలని భావించిన ప్రభుత్వం రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అన్న సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఇక కొత్త నిబంధనల ప్రకారం ఫోల్‌వీలర్స్ ఉన్న వారు రేషన్ కార్డుకు అనర్హులు. ఎవరికైనా కారు ఉంటే వారికి రేషన్ లేనట్టేనని పేర్కొన్నారు .

 Ration Rules changed in AP... car owners are not eligible for ration card

ఇక అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను బీపీఎల్ కోటా క్రింద రేషన్ కార్డు ఇవ్వాలని పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజా సవరణలలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో వార్షికాదాయంతో పాటు ఇతర నిబంధనల్లోనూ మార్పులు చేసింది.

దీని ప్రకారం గ్రామాల్లో వార్షికాదాయం రూ.1.20లక్షలు ఉన్నవారు. పట్టణాల్లో వార్షికాదాయం రూ.144లక్షలు ఉన్న వారు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులుగా ఉండనున్నారు. ఈ తాజా సవరణల ద్వారా అనర్హులకు రేషన్ కార్డులు ఇవ్వకుండా చెక్ పెట్టాలని భావిస్తున్నారు.

English summary
AP CM Jagan Changed ration rules . The government has sought to make amends for food safety rules in the AP and amended who is eligible for ration cards. The latest regulations have changed the existing eligibility for the issuance of ration cards. If anyone has a car, they are not eligible for ration .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X