గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు జీజీహెచ్‌లో దారుణం: పసికందును పీక్కుతిన్న ఎలుకలు, మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల ఎలాగున్నాయో తెలియదు కానీ, చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే తిరిగొస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటేనే భయం కలిగిస్తోంది.

రెండు రోజుల క్రితం ఓ మహిళ ప్రసవ వేదనతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.

రోజుల పసిబిడ్డ కావడంతో ఆ బాధకు గుక్కపట్టి ఏడవడంతో, ఏడుపు విని నిద్రలేచిన తల్లి ఎలుకలు తన బిడ్డను కొరుక్కుతినడం గమనించింది. వెంటనే బిడ్డను చికిత్స కోసం వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆ బిడ్డకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు.

అయినప్పటికీ ఆ పసికందు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పసికందు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం జరిగినప్పటికీ ఆసుపత్రి అధికారులు గోప్యంగా ఉంచారు. ఆసుపత్రిలో అపరిశుభ్రత కారణంగా ఎలుకలు సంఖ్య పెరిగి చివరకు ప్రాణాలను తీస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడకు చెందిన నాగరాజు, లక్ష్మీ దంపతులు. చికిత్స నిమిత్తం వీరి పది రోజుల పసికందుని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే తమ బాబు మృతి చెందడానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనని తల్లి లక్ష్మీ తెలిపారు.

మంత్రి ప్రత్తిపాటి దిగ్భ్రాంతి


గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుక దాడిలో పసికందు మృతిచెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై నివేదిక సమర్పించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Rats eat baby in guntur general hospital

చిత్తూరులో దంపతుల బలవన్మరణం

ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో చిత్తూరు నగరానికి చెందిన దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నగరంలోని మెకానికల్ గ్రౌండ్ ప్రాంతంలోని మిట్టూరులో నివాసం ఉంటున్న గోపి (36), ఉమామహేశ్వరి (32) అనే దంపతులు మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకున్నారు.

బుధవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక ఇబ్బందులే వారి ఆత్మహత్యకు కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అనంతపురం జిల్లాలో మహిళా రైతు ఆత్మహత్య

జిల్లాలో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన భాగ్యమ్మ అనే రైతు తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ, పత్తి, ఉల్లిని సాగు చేసింది.

వర్షాలు లేక వేరుశనగ, పత్తి ఎండిపోయాయి. ఐదు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి తలెత్తడంతో భాగ్యమ్మ మనస్తాపానికి లోనైంది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

English summary
Rats eat baby in guntur general hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X