విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజ‌య‌వాడ‌లో ఆ ఇద్ద‌రూ..!? పోలీసుల‌కు ర‌విప్ర‌కాశ్‌..శివాజీ మెయిల్‌: 10 రోజుల గ‌డువు ఇవ్వండి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

విజ‌య‌వాడ‌లో ఆ ఇద్ద‌రూ..!? పోలీసుల‌కు ర‌విప్ర‌కాశ్‌.. శివాజీ మెయిల్‌ || Oneindia Telugu

కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో ర‌వి ప్ర‌కాశ్‌..న‌టుడు శివాజీ హాజ‌రు కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు. హైకోర్టు సైతం ర‌వి ప్ర‌కాశ్ అభ్య‌ర్ద‌న తిర‌స్క‌రించింది. దీంతో..తెలంగాణ పోలీసులకు వారిద్ద‌రి నుండి మెయిల్స్ వ‌చ్చాయి. త‌మ‌కు ప‌ది రోజుల స‌మ‌యం కావాలంటూ వేర్వేరు కార‌ణాల‌ను అందులో ప్ర‌స్తావించారు. అయితే, వారిద్ద‌రూ విజ‌య‌వాడ‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది.

పోలీసుల‌కు మెయిల్స్..
టీవీ9 వ్య‌వ‌హారంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ర‌వి ప్ర‌కాశ్‌..శివాజీ నుండి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఈ మెయిల్స్ వ‌చ్చాయి. తాను పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ప‌ది రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని ఆయ‌న మెయిల్ ద్వారా కోరారు. తానున వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల‌న విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని వివరించారు. అదే విధంగా ఇదే కేసుతో సంబంధం ఉన్న సినీ న‌టుడు శివాజీ సైతం పోలీసుల‌కు మెయిల్ పంపారు. త‌న‌కు ఆరోగ్యం స‌రిగా లేద‌ని అందులో పేర్కొన్నారు. తాను ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నాన‌ని..విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ప‌ది రోజుల స‌మ‌యం కావాల‌ని అందులో విజ్ఞ‌ప్తి చేసారు. పోలీసులు ఈ మెయిల్స్ పైన సంతృప్తి చెంద‌ని పోలీసులు వీరెక్క‌డున్నార‌నే కోణంలో విచార‌ణ సాగిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

Ravi prakash and Sivaji asked 10 days time for appear before police through e mail..

విజ‌య‌వాడ‌లో ఆ ఇద్ద‌రూ..
పోలీసుల‌కు వ‌చ్చిన మెయిల్స్ ఐపి చిరునామాల ఆధారంగా ఆ ఇద్ద‌రూ విజ‌య‌వాడ‌లో ఉన్నార‌నే స‌మాచారం పోలీసులు గుర్తించార‌ని చెబుతున్నారు. దీని పైన వారు దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. అంత‌కు ముందు త‌న‌పై పోలీసులు సీఆర్‌పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్‌ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది. దీంతో.. పోలీసులను స‌మ‌యం కోరుతూ మెయిల్స్ పంపారు. ఇప్పుడు సైబ‌ర్ పోలీసులు వీరి అభ్య‌ర్ధ‌నను ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు వీటి పైన ఏర‌కంగా స్పందిస్తార‌నేది వేచి చూడాల్సిందే. వారు అడిగిన ప‌ది రోజుల స‌మ‌యం ప‌రిశీలిస్తే..23న ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తుంద‌నే అంచ‌నాతో ఈ ర‌కంగా స‌మ‌యం కోరుతూ మెయిల్స్ పంపార‌నే చ‌ర్చ సాగుతోంది.

English summary
TV9 Ex CEO Ravi Prakash and Hero Sivaji requested Cyber police to appear for investigation in forgery case. By e mails both of them requested for time. Police Traced IP Address and expecting both are in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X