వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీమేధతో సీటు, కాంగ్‌తో కలిస్తే బెయిల్: జగన్‌పై రావుల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ravula Chandrasekhar Reddy
హైదరాబాద్: శ్రీమేధలో చేరితే రాంబాబుకు సిఏ సీటు వస్తుందని, కాంగ్రెసుతో కలిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి శుక్రవారం ఎద్దేవా చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చలో భాగంగా శాసన సభలో రావుల మాట్లాడారు. క్లాజు 8కు సవరణలు కోరామన్నారు. గడువు పెంచడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు.

తెలంగాణ బిల్లుపై చర్చలో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ కోరిక దశాబ్దాల నాటిదని, హింసకు తావులేకుండా తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పంపిన బిల్లును మంత్రులే వ్యతిరేకిస్తున్నారన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని 2008లో టిడిపి లేఖ ఇచ్చిందన్నారు. లేఖపై తాము వెనక్కి పోలేదన్నారు.

ఎలాంటి హింసకు తావులేకుండా తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాలుగా నడిచిందన్నారు. మంత్రులుగా ఉండేవారే చర్చను అడ్డుకోవడం సరైన సంప్రదాయం కాదన్నారు. తెలంగాణపై తమ విధానంలో ఎలాంటి మార్పు లేదన్నారు. రెండు ప్రాంతాలకు ఒకే హైకోర్టు ఉండటం సమంజసం కాదన్నారు. హైకోర్టులో సీమాంధ్ర ఉద్యోగులే ఎక్కువ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా బిల్లు లేదన్నారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు వద్దని, హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా రెండేళ్లు చాలన్నారు.

తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తమ పార్టీ పైన ఉద్దేశ్య పూర్వకంగా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు చేస్తోందన్నారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు మాట మార్చిందన్నారు. తాము కాంగ్రెసు పార్టీతో కలిసేందుకు తమకు బెయిలు, కేసులు లేవని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

శ్రీమేథలో చేరితే రాంబాబుకు సీటు వస్తుందని ఓ యాడ్ ఉందని అలాగే కాంగ్రెసుతే కలిస్తే జగన్‌కు బెయిల్ వస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెసుతో కలవడం వల్లనే బెయిల్ వచ్చిందని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ఓ పద్ధతి ప్రకారం తమపై బురద జల్లుతున్నారన్నారు. జగన్‌కు చెందిన సాక్షిలో ఒకేరోజు ఒకే వార్తను కర్నూలు ఎడిషన్‌లో ఓ రకంగా, కరీంనగర్ ఎడిషన్లో మరోరకంగా ఇచ్చారన్నారు.

చంద్రబాబు ప్రసంగాన్ని రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా సాక్షి ఇచ్చిందన్నారు. పది ఛార్జీషీట్లలో జగన్ నిందితుడు అన్నారు. ఆత్మస్తుతి, పరనింద సాక్షి పత్రికలో కనిపిస్తుందన్నారు. జగన్ ఇప్పటికే తెలంగాణను దోచుకున్నారని, మిగిలి ఉన్న దానిని దోచుకునేందుకు సమైక్యం అంటున్నారని ఆరోపించారు. తెలంగాణ అంశం గెలుపోటములకు సంబంధించినది కాదని, తెలంగాణ వచ్చినంత మాత్రాన సీమాంధ్రుల ఓడినట్లు కాదన్నారు. మ్యాచ్ అయిపోయిందని, ఇక ముఖ్యమంత్రి భావోద్వేగాలు పెంచవద్దన్నారు.

జేబు దొంగలు కూడా జైలు నుండి వస్తే రుమాలు అడ్డు పెట్టుకొని వస్తారని కానీ జగన్ చేతులు ఊపుకుంటూ వస్తున్నారన్నారు. టిడిపి అనని మాటలు అన్నట్లుగా ఆ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుట్రలో భాగంగానే లక్ష్మీ నారాయణకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. సీమాంధ్రలో తుడిచి పెట్టుకుపోతామనే భయంతో కాంగ్రెసు జగన్‌తో కలిసి వెళ్తోందన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కొత్త పార్టీకి టిషర్టులు పుట్టుకు వస్తున్నాయన్నారు.

English summary
Telugudesam Party senior leaders Ravula Chandrasekhar Reddy on Friday said that Congress and YSR Congress Party are targetting TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X