వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: ముట్టడించిన సీమ విద్యార్ధి సంఘాలు: రాజధాని..హైకోర్టు డిమాండ్ తో..!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఊహించని విధంగా రాయలసీమకు చెందిన విద్యార్ధి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి వచ్చాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్దులు రాయలసీమకు న్యాయం చేయాలని నినాదాలు చేసారు. రాయలసీమ లో రెండో రాజధాని..కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. కృష్ణా రివర్ బోర్డును సైతం రాయలసీమలో ఏర్పాటు చేయాలంటూ విద్యార్ది సంఘాల నేతలు డిమాండ్ చేసారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున విద్యార్ధి సంఘాలు అక్కడకు చేరుకోవటంతో..పోలీసులు వెంటనే స్పందించారు. వారిని అరెస్ట్ చేయటానికి ప్రయత్నించిన సమయంలో తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో..పోలీసు బలగాలను దించారు. ఆ వెంటనే ఆందోళన చేస్తున్న విద్యార్దులను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.

సీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలంటూ..
కొంత కాలంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. కర్నూలుకు వచ్చిన పలువురు మంత్రులను సైతం ముట్టించారు. ఆ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు సైతం కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కొద్ది రోజులు విధులు బహిష్కరించారు. ఇక, కొద్ది సేపటి క్రితం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం తమకు రెండో రాజధానిగా కేటా యించాలని తమ న్యాయపరమైన కోరికను తీర్చాలని డిమాండ్ చేశారు. కృష్ణా రివర్ బోర్డు సీమలో ఏర్పాటు చేయాలని నినాదాలు కొనసాగించారు.

Rayalaseema studnets protest near assembly on implementation of Sri bagh agreement

తోపులాట..ఉద్రిక్తత..
ఊహించని విధంగా విద్యార్ధులు రాయలసీమ నుండి వచ్చి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తొలుత వారిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. విద్యార్ధి సంఘాల నేతలను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా..వారు ప్రతిఘటించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులను దింపారు. దీంతో..తమను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలోనే విద్యార్ధులు తమ డిమాండ్లకు అనుగుణంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులను అదుపులోకి తసీుకున్న పోలీసులు..వారిని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీసు స్టేషన్ కు తరలించారు.

English summary
Rayalaseema studnets protest near assembly on implementation of Sri bagh agreement. They demand for second capital in Seema and High court in Kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X