వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారులకు బెదిరింపు, విజయసాయి రెడ్డికి చిక్కులు!: డీజీపీకీ రాయపాటి ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ రాయపాటి సాంబశివ రావు గురువారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. అధికారులను అవమానించారంటూ ఈ ఫిర్యాదు చేశారు.

పవన్ కళ్యాణ్ మరో జేఎఫ్‌సీ వేయాలి, పిచ్చికుక్కల..: బాబుపై పార్థసారథి సంచలనంపవన్ కళ్యాణ్ మరో జేఎఫ్‌సీ వేయాలి, పిచ్చికుక్కల..: బాబుపై పార్థసారథి సంచలనం

ఈ మేరకు రాయపాటి తన ప్రతినిధుల ద్వారా ఫిర్యాదును డీజీపీకి పంపించారు. విజయసాయిపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. అధికారి సతీష్ చంద్రను ఆయన బెదిరించాడని పేర్కొన్నారు.

చదవండి: ఎమ్మెల్యేలు పార్టీ మారటం వెనుక ఐఏఎస్‌లు, బాగోతం బయటపెడ్తా: విజయసాయి మరో బాంబు

 అధికారులను బెదిరించేలా ఉన్నాయి

అధికారులను బెదిరించేలా ఉన్నాయి

సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రపై, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర రావులపై విజయసాయి చేసిన వ్యాఖ్యలు బెదిరించేలా ఉన్నాయని ఫిర్యాదులో రాయపాటి పేర్కొన్నారు. బెదిరించడంపై చర్యలు తీసుకోవాలన్నారు.

 అధికారులకు పరువు నష్టం కలిగించేలా

అధికారులకు పరువు నష్టం కలిగించేలా

విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు అధికారులకు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని రాయపాటి పేర్కొన్నారు. అధికారులను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా ఆయనపై ముందుకు వెళ్లాలని చెప్పారు.

వివాదం ముదిరేలా

వివాదం ముదిరేలా

కాగా, ఇటీవల అధికారులపై విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. తాజాగా గురువారం తన వ్యాఖ్యలపై తగ్గే ప్రసక్తి లేదని, అవసరమైతే సందర్భం వచ్చినప్పుడు వారి విషయం బయటపెడతానని కూడా మరోసారి హెచ్చరించారు. దీంతో అధికారులు, వైసీపీ మధ్య వివాదం ముదిరేలా కనిపిస్తోంది.

 తాము అధికారంలోకి వస్తే అనడం సరికాదు

తాము అధికారంలోకి వస్తే అనడం సరికాదు

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని కొందరు అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నారు. అధికారులకు హెచ్చరికలు సరికాదంటున్నారు.

English summary
Telugu Desam Party leader and MP Rayapati Sambasiva Rao complained against YSRCP MP Vijaya Sai Reddy for his comments on IAS officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X