గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలోకి రాయ‌పాటి ..!? హోదా విష‌యంలో టీడీపీ ఏ2 : మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లాలో టీడీపీలో క‌ల‌క‌లం. జిల్లాలో సీనియ‌ర్ రాజకీయ కుటుంబం రాయ‌పాటి కుటుంబంలో రాజ‌కీయ చీల‌క వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. న‌ర్స‌రావుపేట నుండి టీడీపీ ఎంపీగా బ‌రిలో ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అదే పార్టీలో కొన‌సాగుతున్నారు. ఇప్పుడు ఆయ‌న సోద‌రుడు మాజీ ఎమ్మెల్యే రాయ‌పాటి శ్రీనివాస్ ఆయ‌న త‌న‌యుడు తో స‌హా పార్టీ వీడి..వైసీపీలో చేరుతున్నార‌ని స‌మాచారం.

టీడీపీ పైన అసంతృప్తి...
2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాయ‌పాటి సోద‌రులు కాంగ్రెస్ వీడి టీడీపీలో చేరారు. ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో న‌ర్స‌రావుపేట నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్ప‌టికే రాయ‌పాటి సాంబ‌శివ‌రావు పోల‌వ‌రం నిర్మాణంలో ప్ర‌ధాన కాంట్రాక్ట‌ర్‌గా ఉన్నారు. అక్క‌డ న‌ష్టాలు వ‌చ్చాయ‌ని చెబుతారు. ఇక‌, ఆయ‌న సోద‌రుడు రాయ‌పాటి శ్రీనివాస్‌కు టీడీపీ అధినాయ‌క‌త్వం ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తామ‌ని హామీ ఇచ్చినా అమ‌లు కాలేదు.

ఉత్త‌రాంధ్ర‌లో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేత‌లకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వ‌స్తాయి...!ఉత్త‌రాంధ్ర‌లో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేత‌లకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వ‌స్తాయి...!

ఇక‌, తాజా ఎన్నిక‌ల స‌మ‌యంలో రాయ‌పాటికి తిరిగి నర్స‌రావుపేట ఎంపీ సీటు ఇవ్వ‌టానికి తొలుత అంగీక‌రించ‌లేదు. త‌న‌తో పాటు త‌న కుమారుడు రంగారావుకు అసెంబ్లీ సీటు ఇవ్వాల‌ని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సీఎంను కోరారు. కానీ, రాయ‌పాటి పార్టీ వీడుతార‌నే వార్త‌ల న‌డుమ త‌రిగి రాయ‌పాటికి న‌ర్స‌రావుపేట ఎంపీ సీటు ఖ‌రారు చేసారు. ఆయ‌న త‌న‌యుడికి మాత్రం ఎక్క‌డా సీటు ల‌భించ‌లేదు. దీంతో..సోద‌రుడు రాయ‌పాటి శ్రీనివాస్ కుటుంబం టీడీపీ పైన అసంతృప్తితో ఉన్నారు.

Rayapati Family politically devided: Sambasiva Rao brother family may join in YCP..

సోద‌రుడు కుటుంబం వైసీపీలోకి..!
రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సోద‌రుడు డాక్ట‌ర్ రాయ‌పాటి శ్రీనివాస్ వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణ‌యించిన‌ట్లు చెబుతున్నారు.తాజాగా రాయ‌పాటి శ్రీనివాస్ కుమారుడు..గుంటూరు మాజీ మేయ‌ర్ రాయపాటి మోహన్ సాయికృష్ణ టీడీపీ పైన అనుచిత వ్యాఖ్య‌లు చేసారు. హోదా విషయంలో కాంగ్రెస్, టీడీపీలను ఏ1, ఏ2లుగా నిందిస్తూ ఏ3, ఏ4 అంటూ జనసేన, బీజేపీపై ఆరోపణలు చేశారు. టీడీపీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

తాను ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై గళం ఎత్తుతానని మోహన్ సాయికృష్ణ చెప్పడం హాట్‌టాపిక్ అయింది. దీంతో..ఇప్పుడు రాయ‌పాటి శ్రీనివాస్ కుటుంబం టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గతంలో గుంటూరు నగర మేయర్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు అదే సీటుపై ఆశలు పెట్టుకున్నారని, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న వేళ ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

English summary
Guntur district senior politician and Narasarao pet Mp Rayapati Sambasiva Rao brother Rayapati Srinivas Family may be join in YCP shortly. Guntur ex mayor Rayapati Mohan Sai krishna comments on TDP indicates his party leaving TDP and join in YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X