వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపి రాయపాటి ముందు పోటీకి నై....కానీ ఇప్పుడు మళ్లీ సై...

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

గుంటూరు:గుంటూరు జిల్లాలో ఒక సీనియర్ ఎంపి కొన్నాళ్ల క్రితం చేసిన ప్రకటన టిడిపిలో ఎంతో మందికి మోదాన్నిచ్చింది. దీంతో పలువురు నేతలు ఆ ప్రకటన అనుసారం ఒక సీటు ఖాళీ అవుతుందని ఆశపడి మాకుమాకంటూ ఎగబడ్డారు.

అయితే మళ్లీ అదే ఎంపీ తూచ్ అంటూ నా సీటు నాదేనని మళ్లీ తాజాగా ప్రకటన చేయడంతో అయ్యో ఎంత పని జరిగింది మళ్లీ ఇప్పుడు మరో చోట ఖాళీ వెతుక్కోవాలే అని ఉసూరుమంటున్నారు ఆ నేతలు...ఇంతకీ ఆ నేత ఎవరంటే నర్సరావు పేట ఎంపి రాయపాటి సాంబశివరావు. గతంలో తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన రాయపాటి సాంబశివరావు తాజాగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోతున్నట్లు స్పష్టం చేయడంతో పలువురు టిడిపి నేతలు డీలా పడ్డారు. కారణమేమిటంటే....

ఎంపి రాయపాటి...ఒకనాటి ప్రకటన

ఎంపి రాయపాటి...ఒకనాటి ప్రకటన

ఏదేని కారణాల వల్ల మనస్థాపమో, లేక నిజంగా అనారోగ్య కారణాలో లేక మరోటో తెలియదు కానీ నర్సరావు పేట ఎంపి రాయపాటి సాంబశివరావు తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. ఇటీవలి కాలంలో రాయపాటి కుమారుడు రంగారావు పాలిటిక్స్ లో చురుగ్గా తిరుగుతుండటంతో అక్కడ ఆయన కుమారుడిని బరిలోకి దించవచ్చని అందరూ భావించారు. అయితే ఆయన కుమారుడు తాను ఎమ్మెల్యేగా పోలీచేస్తానని, ఎంపీగా కాదని స్పష్టం చేయడంతో టిడిపిలోని ఆశావాహుల నేతల దృష్టంతా ఒక్కసారిగా ఆ ఎంపి సీటుపై పడింది. దీంతో ఈ ఎంపి టికెట్ కోసం టీడీపీలో అనూహ్యమైన రేస్ మొదలైంది.

సీట్ల కోసం...తహతహ

సీట్ల కోసం...తహతహ

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎపిలో అధికార,ప్రతిపక్ష నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చాపకింద నీరులా తమ తమ యత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టిడిపి తరుపున ఆశావాహుల సంఖ్య బాగా ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరికి టికెట్ లభ్యతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సీట్ల మార్పిడి కోరుకున్న నేతలు, తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకోవాలనుకున్న సిట్టింగ్ ప్రజాప్రతినిధులు తమ వారికి అనువైన సీట్ల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. అలాంటి తరుణంలో తాను మళ్లీ ఎన్నికల్లో పోటీచేయనన్న నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు ప్రకటన అలాంటి వారికి ఎడారిలో ఒయాసిస్సులా తోచిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. టికెట్ మాకు కావాలి...మా వారికి కావాలనేవారే తప్పించి మాకు వద్దు అనే నేతే లేకపోవడంతో
ఆ ప్రకటన చేసిన ఎంపీ రాయపాటికి మనస్సులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ పలువురు నేతలు ఆయన స్థానంపై కర్చీఫ్ వేసి రిజర్వ్ చేసే ప్రయత్నాలు ఆరంభించారు.

ఎవరెవరంటే...పెద్ద లిస్టే!

ఎవరెవరంటే...పెద్ద లిస్టే!

2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు తన భార్యకు దర్శి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఈసారి తాను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీచేయాలని భావించారు. ఆయనకు ఎంపి రాయపాటి ప్రకటన తనకోసమే నన్నంతగా ఊరట కలిగి నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి తానుపోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో చెప్పారట. మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గతంలో నర్సరావుపేట ఎంపీగా గెలుపొందిన మోదుగుల వేణుగోపాలరెడ్డి మళ్లీ అక్కడికే వెళ్లాలని ఆశిస్తున్నారట. అయితే ఇదే సీటును గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు కూడా ఆశిస్తున్నారట. తన భార్యకు వినుకొండ అసెంబ్లీ సీటు, తనకు నర్సరావుపేట ఎంపి సీటు ఇస్తే ఆ రెండు సీట్లు బంపర్ మెజారిటీతో గెల్చి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నారట. ఒక్క మోదుగుల తప్ప మిగిలిన వారందరూ ఇక్కడ గెలుపు కోసం ఎంతయినా ఖర్చుపెట్టేందుకు సిద్దమని స్పష్టం చేస్తున్నారట.
అయితే ఇప్పుడే కాకుండా ఆ సమయం వచ్చినప్పడు ఈ సీటు కోసం టిడిపి లోని మరికొందరు ప్రముఖులు తెరమీదకు రావడం ఖాయమని తెలిసింది.

ఈనేపథ్యంలో...రాయపాటి మరో ప్రకటన

ఈనేపథ్యంలో...రాయపాటి మరో ప్రకటన

అయితే ఊహించని విధంగా ఎంపి రాయపాటి తాజాగా చేసిన మరో ప్రకటన ఈ నేతల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లయింది. ముందు పోటీకి నై అన్న ఎంపి రాయపాటి ఇప్పుడు మాత్రం తాను పోటీకి సై అనే అంటున్నారట. వచ్చే ఎన్నికల్లో తనకు గుంటూరు ఎంపి సీటు ఇస్తే తప్పించి నర్సరావుపేట నియోజకవర్గాన్ని వదిలేదిలేదని, లేకుంటే అధిష్టానం ఆదేశం మేరకు మళ్లీ నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపిగా బరిలోకి ఉండటం ఖాయమని స్పష్టం చేస్తున్నారట.
ఎంపి రాయపాటి నుంచి వచ్చిన ఈ అనూహ్య ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ నాయ‌కులు ఖంగుతిన్నారట. ఒక కీలకమైన నియోజకవర్గం లభిస్తుందనుకుంటే ఇలా జరిగిందేమిటా అని లోలోన మథనపడిపోతున్నారట.

రాయపాటి...పోటీ...ఎందుకంటే?

రాయపాటి...పోటీ...ఎందుకంటే?

దీంతో వీళ్లందరూ రాయపాటి ఎందుకు మళ్లీ నిర్ణయం మార్చుకున్నారా అని ఆరాతీస్తే ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందట. అదేమిటంటే పూర్వాశ్రమంలో తనకు అత్యంత బద్దశత్రువైన కన్నా లక్ష్మీనారాయణకు తాజాగా బిజెపి ఎపి అధ్యక్ష పదవి లభించడమే రాయపాటి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణమైందట. కన్నా ఎపి బిజెపి అధ్యక్షుడిగా కీలక స్థానంలో ఉండి, మరోవైపు ఎన్నికల్లో పోటీచేసి గెలిస్తే, కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే కన్నాతో బద్ద వైరం కారణంగా రాజకీయంగా తాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, నిన్నటిదాకా బిజెపిలో కన్నా అనామకంగా ఉండటంతో ఆయన గురించి పట్టించుకోని రాయపాటి ఇప్పుడు కన్నా ఎపి బిజెపి అధ్యక్షుడిగా కీలక పదవి చేపట్టడంతో భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి మళ్లీ పోటీకి సై అంటున్నట్లుగా తెలిసింది.కారణాలేమైనా రాయపాటి మళ్లీ పోటీకి సిద్దపడటం టిడిపిలోనే కొందరికి ఖేదాన్ని కలిగించిందని అభిజ్ఞవర్గాల భోగట్టా.

English summary
Guntur:Many TDP leaders have hope for the seat that the MP Rayapati Sambasiva Rao had announced in the past that he would not contest the elections again. But their hopes have been wiped out when the MP Rayapati announced that he will contest again in Narsaraopet as MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X