వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు కితాబిచ్చిన రాయపాటి.. వైసీపీ వైపు చూస్తున్నారా ?

|
Google Oneindia TeluguNews

గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో పాటు, ప్రస్తుతం కోడెల శివప్రసాద్ కి వ్యతిరేకంగా టిడిపిలో పోరుబాట పట్టిన రాయపాటి సాంబశివరావు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు త్వరలో బీజేపీలో చేరనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇక దీని పై క్లారిటీ ఇచ్చిన రాయపాటి సాంబశివరావు త్వరలోనే తాను బీజేపీలో చేరుతానని చెప్పారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

సడెన్ గా యూటర్న్ తీసుకున్న రాయపాటి.. జగన్ కు పొగడ్తల వర్షం

సడెన్ గా యూటర్న్ తీసుకున్న రాయపాటి.. జగన్ కు పొగడ్తల వర్షం

సడెన్ గా యూటర్న్ తీసుకున్న రాయపాటి బీజేపీని కాదని, వైసీపీలోకి వెళ్లాలని ఉత్సాహం చూపిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఈరోజు తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాయపాటి సాంబశివరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఊహించని విధంగా వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురిపించారు.మొన్నటి వరకు వైసీపీ పై విమర్శలు చేసిన రాయపాటి తాజాగా యూటర్న్ తీసుకుని ప్రశంసల వర్షం కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ పాలన చాలా బాగుందంటూ కితాబు ఇచ్చారు రాయపాటి అంతేకాదు జగన్ పథకాలను కూడా మెచ్చుకున్నారు.

నవరత్నాల పథకానికి నిధుల కొరత ఉందన్న రాయపాటి

నవరత్నాల పథకానికి నిధుల కొరత ఉందన్న రాయపాటి

నవరత్నాల పథకానికి నిధుల కొరత ఉందని, కేంద్ర రాష్ట్రానికి ఏమాత్రం సహకరించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నూతన టెండర్లు పిలవడం వల్ల వ్యయం పెరుగుతుందని ఆయన భావించారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరాలని అనుకుంటున్నానో ప్రకటిస్తానని పేర్కొన్నారు రాయపాటి సాంబశివరావు. ఇక రాయపాటి చేసిన వ్యాఖ్యలు విన్నవారంతా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారా అని చర్చిస్తున్నారు. అందుకే జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ, కేంద్రంలోని బిజెపి గురించి సహకరించడం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నారు.

టీడీపీని వీడే యోచనలో రాయపాటి .. రీజన్ ఇదే

టీడీపీని వీడే యోచనలో రాయపాటి .. రీజన్ ఇదే

ఇక మరోపక్క టిడిపిలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, టిడిపి నేతల టార్గెట్ గా వైసిపి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదన్న భావన ఉన్న తరుణంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు కోడెల శివప్రసాద్ వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాయపాటి వర్గం కోడెల విషయంలో చర్య తీసుకోమని చంద్రబాబు ను కోరిన చంద్రబాబు స్పందించకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇంతకీ రాయపాటి వైసీపీలో చేరుతారా.. బిజెపి బాట పడతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

English summary
There has been talk that the Rayapati Sambasivarao is planning to go into ycp. Rayapati Sambasivara Rao, who visited Venkateswara Swamy in Thirumalai today, made an unexpected comment on the YSR Congress Party. He praised Jaganmohan Reddy decisions and his schemes navarathnalu .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X