వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు మద్దతు: టిడిపిలోకి రాయపాటి, టిపై సుదర్శన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raypati Sambasiva Rao
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షకు గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివ రావు గురువారం సంఘీభావం తెలిపారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు న్యూఢిల్లీలోని ఎపి భవన్లో నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నారు. గురువారం ఉదయం రాయపాటి ఆయనకు సంఘీభావం తెలిపారు.

కాగా తాను ఎప్పుడో కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశానని రాయపాటి ఈ సందర్భంగా చెప్పారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పార్టీకి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు తాను ఎప్పుడో కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశానని చెప్పడమే కాకుండా బాబుకు మద్దతు తెలపడంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.

భయం వద్దు: సుదర్శన్ రెడ్డి

2014 సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పడుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్సన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లోను ఆగదని, ఎవరు భయాందోళన చెందవద్దని ఆయన తెలిపారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తాము తీసుకున్న నిర్ణయానికి తిరుగు లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పిసి చాకో చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాష్ట్ర విభజన ఎన్నికల్లోపే పూర్తవుతుందా, ఎన్నికల తర్వాతా? అనే విషయం మాత్రం చెప్పలేమంటూ ప్రకటన చేశారు.

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని, మారుతున్న పరిస్థితులు, వాటిని చక్కదిద్దడం, ఇతర పార్టీల సహకారం వీటన్నింటిపైనే ఇది ఆధారపడి ఉంటుందని, పరిస్థితులు దిగజారితే కళ్లు మూసుకుని కూర్చోలేమని, వాటిని పరిష్కరించాలని, తెలంగాణ ఏర్పాటు చేయాలన్న పార్టీ నిర్ణయం మాత్రం తిరుగులేనిదని, దాన్ని ఎన్నికలకు ముందు అమలు చేస్తామా? తర్వాత అమలు చేస్తా మా? అంటే చెప్పలేమన్నారు.

English summary
Congress Party senior leader, Guntur MP Raypati Sambasiva Rao visited TDP chief Nara Chandrababu Naidu and expressed his solidarity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X