అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ తో మైత్రికి సిద్దం : రాజ‌కీయాలు అంటే అంతే : జేసి దివాక‌ర‌రెడ్డి సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

ఎప్పుడూ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర రెడ్డి మ‌రోసారి అదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌మ తో క‌లిసి స‌హ‌క‌రించాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రి కోరితే..వ‌ప‌న్ ఆ ప్ర‌తిపాద‌న ను తిరస్కరించారు. తాజాగా..టిడిపి ఎంపీ జేసి దివాక‌ర రెడ్డి జ‌గ‌న్ తో మైత్రికి సిద్ద‌మంటున్నారు..

మొన్న ప‌వ‌న్‌..నేడు జ‌గ‌న్..

మొన్న ప‌వ‌న్‌..నేడు జ‌గ‌న్..

2014 ఎన్నిక‌ల్లో టిడిపికి మ‌ద్ద‌తిచ్చి..అధికారంలోకి రావ‌టానికి స‌హ‌క‌రించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ను తిరిగి త‌మ‌తో క‌లిసి రావాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆహ్వానించారు. ప‌వ‌న్ త‌మ‌తో క‌లిస్తే జ‌గ‌న్ ను నొప్పేంటి అని ప్ర‌శ్నించారు. బిజెపి పై పోరాటానికి త‌మ‌తో క‌ల‌వాల‌ని పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాద‌న‌ను ప‌వ‌న్ తిరస్క‌రిస్తూ.. ఏపిలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తామ‌ని..ఎవ‌రితో పొత్తు ఉండ‌ద‌ని తేల్చి చెప్పేసారు. ఇక‌, ఇప్పుడు పార్టీ అధినేత త‌మ‌ను వ్య‌తిరేంచిన ప‌వ‌న్ తో పొత్తు కోరుకుంటుండ‌గా..తాము మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉండాల‌నుకున్నారో ఏమో.. జేసి లాంటి నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయకుండా అసలు ఉండ‌లేరు. కేంద్రం పై పోరాటం..ప్ర‌ధాని మోదీ పై ఫైర్ అవుతున్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ తో మైత్రికి సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. అయితే, టిడిపి నేత‌లు ఇలా ఎందుకు వ్యాఖ్య‌లు చేస్తున్నారా..ఇందులో ఏమైనా రాజ‌కీయ వ్యూహం ఏమైనా దాగి ఉందా అనే చ‌ర్చ మొద‌లైంది. సాధ్యం కాని ప్ర‌తిపాద న అని తెలిసి మ‌రీ ప్ర‌స్తావించ‌టం పైనే ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌న్ తో మైత్రికి సిద్దం.. రాజ‌కీయాలు అంతే..

జ‌గ‌న్ తో మైత్రికి సిద్దం.. రాజ‌కీయాలు అంతే..

ఎంపి జేసి దివాక‌ర రెడ్డి దాదాపు ప్ర‌తీ సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తారు. పార్టీ స‌మావేశాల్లోనూ.. పార్టీ స‌భ‌ల్లోనూ జ‌గ‌న్ ను తిడుతూ..ముఖ్య‌మంత్రిని పొగుడుతూ వ్యాఖ్య‌లు చేయ‌టం ఆయ‌నకు ఆల‌వాటు. ఇక‌, ఆయ న సోద‌రుడు ప్ర‌భాక‌ర రెడ్డి సైతం జ‌గ‌న్ పై తీవ్ర దూష‌ణ‌ల‌కు దిగిన సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా, లోక్‌స‌భ నుండి టిడిపి ఎంపీల‌ను స‌స్పెండ్ చేసిన దాని పై ఎంపీలు ఫైర్ అవుతున్నారు. ప్ర‌ధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో..జేసి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్ ను కూడా మిత్రుడుగా చేసుకోవ‌టానికి.. జ‌గ‌న్ తో మైత్రికి సిద్ద‌మ‌ని సంచ‌ల‌నం రేపారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు..శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రని జేసి చెబుతూ వ‌స్తున్నారు. అయితే, జ‌గ‌న్ ఏ ప‌రిస్థితుల్లోనూ టిడిపి ఉన్న కూట‌మిలో ఉండటం .. లేదా చంద్ర‌బాబు చెబుతున్న‌ట్లు గా స‌హ‌క‌రించే ప‌రిస్థితి మాత్రం ఉండే అవ‌కాశాల్లేవు. ఇప్పుడు జేసి చేస్తున్న ప్ర‌తిపాద‌న ఏమాత్రం ఆమ‌ల‌య్యే ఛాన్స్ లేద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఇప్పుడు జ‌గ‌న్ అవ‌స‌రం ఏంటి...జేసి వ్యాఖ్య‌ల వెనుక‌..

ఇప్పుడు జ‌గ‌న్ అవ‌స‌రం ఏంటి...జేసి వ్యాఖ్య‌ల వెనుక‌..

ఎంపి జేసి దివాక‌ర రెడ్డి ప్ర‌ధాని మోదీ పై ఫైర్ అయ్యారు. అయన రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. తాము బిజెపి పై చేస్తున్న పోరాటానికి జ‌గ‌న్ త‌మ‌తో స‌హ‌కరించాల ని కోరుతున్నారు. ఒక ర‌కంగా తాము కేంద్రం పై పోరాడుతుంటే.. జ‌గ‌న్ - ప‌వ‌న్ త‌మ‌కు స‌హ‌క‌రించ‌టం లేద‌నే సంకేతా లు ఇచ్చేందుకే టిడిపి ఇలా వ్యూహాత్మ‌క ప్ర‌తిపాద‌న‌లు తెర మీద‌కు తెస్తుందా అనే అనుమానం క‌లుగుతోంది. ఇదే స మ‌యంలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు ప్ర‌తిపాద‌న‌ల పైనా జేసి అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న ల‌క్ష్య సాధ‌న కోసం ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం..జేసికి కొత్త కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి.. ఇక ఇప్పుడు జేసి చేసిన వ్యాఖ్య‌ల పై టిడిపి నేత‌లు..వైసిపి నుండి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి..

English summary
TDP M.P JC Diwakar reddy sensational comments in Delhi. He stated that they are ready to friend ship with YCP chief jagan. Now this comments become sensation in AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X